Featured

Producer MS Raju : అక్కడితో మా రిలేషన్ కట్ అయిపోయింది… వాడు హీరో ఏంటని ఎగతాళి చేసేవారు…: ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు

Producer MS Raju : దేవి, వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనోద్ధాంటానా వంటి వరుస హిట్లతో వరుస ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నిర్మాత ఎంఎస్ రాజు గారు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా అభిరుచి గల నిర్మాత. ఆయన బ్యానర్ లో సినిమా అంటే కచ్చితంగా కథ బాగుంటుంది అనేంతలా ఆయన మార్క్ వేసుకున్నారు. వరుస సక్సెస్ లు చూసిన ఎంఎస్ రాజు గారు ఆ తరువాత వరుస ఫ్లాప్స్ అందుకుని ప్రస్తుతం చిన్న సినిమాలను తీస్తున్నారు. ఇక డైరెక్టర్ గా మారి ‘డర్టీ హరి’ అనే బోల్డ్ అటెంప్ట్ చేసిన ఎంఎస్ రాజు గారు ఇటీవల కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా ‘సెవెన్ డేస్ సిక్స్ నైట్స్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిన్న సినిమాలకు పరిమితమైన ఎంఎస్ రాజు గారు ఆయన అనుభవాలను ఇటీవల పలు ఇంటర్యూలలో పంచుకున్నారు.

ఆ రోజు మా రిలేషన్ కట్ అయింది…

ఇక సిద్ధార్థ హీరోగా ఇలియానా హీరోయిన్ గా ‘ఆట’ సినిమా తీస్తున్నపుడు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన డైరెక్టర్ వీర శంకర్ కన్నడలో ఒక సినిమా చేసారు అదే ‘నమ్మ బసవ’, పునీత్ రాజ్ కుమార్ అందులో హీరో. ఆ సినిమాలోని ఒక సన్నివేశం చాలా బాగుంటుంది దాన్ని నేను ఆట సినిమాలో వాడాలని అనుకుని వీర శంకర్ ను అడిగితే వాడుకొండని చెప్పాడు. నెక్స్ట్ తనతో వేరే ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను. ఇక సీన్స్ వాడాలని అనుకున్నపుడు అగ్రిమెంట్ లాంటిది తీసుకోవాలని నాకు తెలియదు, వీర్ శంకర్ కు నాకు మధ్య ఎవరో ఏవో అపద్ధాలు చెప్పడం ఎంఎస్ రాజు నిన్ను వాడుకుంటున్నాడు, నీతో సినిమా చేయడు అంటూ చెప్పడంతో వీర శంకర్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసాడు. కథ నాది అంటూ ఫిర్యాదు చేయడంతో సినిమా విడుదల అయ్యాక ఆ సీన్ వాడుకున్నందుకు డబ్బులు ఇచ్చాను.

ఇద్దరిదీ తప్పు ఉందని నేను అనుకోవడం లేదు, కేవలం మధ్యలో ఉన్న వ్యక్తుల వల్ల వీరశంకర్ నన్ను అపార్థం చేసుకున్నాడు. అయితే ఆ సినిమా తరువాత మా రిలేషన్ కట్ అయింది అంటూ చెప్పారు. ఇక సిద్ధార్థ హీరోగా ‘నువ్వొస్తానంటే నేనొద్ధంటానా’ సినిమాలో హీరోగా తీసుకున్నపుడు పరుచూరి బ్రదర్స్ హీరో ఏంటయ్యా చిన్నపిల్లాడిలా ఉన్నాడు మరీ గడ్డిలాగ జుట్టు పెట్టుకుని అంటూ నవ్వేవారట. ఇక చాలా మంది ఎంఎస్ రాజు కి బాగా ఎక్కువైంది, అందుకే ఎవర్ని పెట్టినా హిట్ అవుతుందని అనుకుంటున్నాడు అని ఎగతాళి చేశారట.

Bhargavi

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

40 minutes ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

43 minutes ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

47 minutes ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

54 minutes ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

1 hour ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

1 hour ago