Mohan Babu : ఆ దర్శకుడికి చాలా పొగరు.. అలా అనడంతో నా తలపై కిరీటాన్ని తీసి నేల కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాను. : మోహన్ బాబు

Mohan Babu : 1978 పొట్టేలు పున్నమ్మ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రామకృష్ణులు, మల్లెపువ్వు, కటకటాల రుద్రయ్య లాంటి చిత్రాలు విజయవంతంగా నిలిచాయి. ఎన్టీ రామారావు నటించిన మరో చిత్రం సింహబలుడు 1978, ఆగష్టు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, వాణిశ్రీ నాయికానాయకులుగా నటించగా, మోహన్ బాబు ప్రతి కథానాయనిగా నటించారు. ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం అందించారు. ఇందులో రావు గోపాలరావు నియంతగా నటించాడు. ఎన్టీ రామారావు చివరిసారిగా నటించిన జానపద చిత్రం.. దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన తొలి జానపద చిత్రం సింహబలుడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో అనేక చిత్రాలు రూపొందించారు అలాగే ఆయన తీసిన కొన్ని చిత్రాల్లో మోహన్ బాబు ప్రతి కథానాయకుడుగా నటించారు.

ఆ తర్వాత లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో మోహన్ బాబు నిర్మాతగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడుగారు చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, శోభన హీరో, హీరోయిన్లుగా నటించారు. అలా కథానాయకుడిగా ప్రతి నాయకుడిగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో మోహన్ బాబు నటించారు. అయితే ఒక టీవీ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు ప్రక్కన కూర్చుని మోహన్ బాబు మాట్లాడుతూ.. 1978 లో వచ్చిన “సింహబలుడు” చిత్ర షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుంటూ.. ఒక పోరాట సన్నివేశంలో ఎన్టీ రామారావుకు మోహన్ బాబుకు మధ్యలో వార్ జరుగుతుంది. ఎత్తయిన ప్రదేశంలో పోరాట సన్నివేశం జరుగుతున్న సందర్భంలో మోహన్ బాబు తన కిరీటాన్ని పెట్టుకున్నారు.. ఎందుకంటే ఎన్టీ రామారావు తన కత్తితో కొడితే ఆ కిరీటం కింద పడిపోవాలి. అది అప్పుడు రాఘవేంద్రరావు దర్శకుడిగా సూచించారు. కెమెరా స్టార్ట్ అనడంతో ఎన్టీఆర్ యాక్షన్ సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఒక్కసారి మోహన్ బాబు కిరీటంపై ఎన్టీఆర్ కొట్టారు. ఆ కిరీటం కింద పడకపోగా.. ఆ దెబ్బకు మోహన్ బాబుకు తలనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని దగ్గరే ఉన్న కో- డైరెక్టర్ కోదండరామిరెడ్డికి డూప్ ను పెట్టండని మోహన్ బాబు చెప్పారు..

దర్శకుడు రాఘవేంద్రరావుతో కోదండ రామిరెడ్డి చెప్పడంతో.. ఆఫ్ట్రాల్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ వాడు చెప్తే నేను వినాలా? అనే తల పొగరు రాఘవేంద్రరావుకు ఆ రోజుల్లో ఉండేదని, ఎందుకంటే హిట్స్ పై హిట్స్ రావడంతో అలా రాఘవేంద్రరావు ప్రవర్తించారని.. ఆ తర్వాత రోజు బెంగళూరులో మరో షెడ్యూలు జరుగుతున్న సందర్భంలో తనను రూముకు పిలిపించుకొని రాఘవేంద్రరావు కాలు మీద కాలు వేసుకుని జీవితంలో పైకి వచ్చేవాడివి ఎందుకలా ప్రవర్తించావు అంటూ అడిగారని.. ఐతే రాఘవేంద్రరావును కలవబోయే ముందు ఇంట్లో తన శ్రీమతి పెద్దాయనతో (రాఘవేంద్రరావు) గొడవ ఎందుకని చెప్పిందని.. అందుకే మౌనంగా ఉండిపోయానన్నారు. ఆ తర్వాత మేమిద్దరం కలిసిపోయి ఆ సినిమా పూర్తి చేసామని.. ఆ టీవీ కార్యక్రమంలో మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అలా మోహన్ బాబు అనడంతో అక్కడే ఉన్నా రాఘవేంద్రరావు అలాగే కోదండరామిరెడ్డి, బి.గోపాల్ ఆశ్చర్యంగా చూడడాన్ని బుల్లితెర ప్రేక్షకులు గమనించడం జరిగింది.