సీనియర్ నటులైన చిరంజీవి మోహన్ బాబుల మధ్య నిత్యం గొడవలు కనిపిస్తూనే ఉంటాయి. వీరిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ రిలేషన్షిప్ ఉందని చాలా మంది భావిస్తుంటారు. ఎప్పుడు గొడవ పడతారో.. ఎప్పుడు కలుస్తారో వారికే తెలియదు.ఇలా ఎన్నో సార్లు వీరిద్దరూ ఒకరి పై ఒకరు మాటల యుద్ధం చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే మోహన్ బాబు మరొకసారి చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పోటీలో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. ఈ ఎన్నికల మధ్య సాధారణ ఎన్నికల మాదిరిగా పోటీ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికలలో అధ్యక్ష పదవి కోసం మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ లేదా అరవింద్ కొడుకు అల్లు అర్జున్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎవరు నిలబడిన నా కుటుంబం మద్దతు పూర్తిగా వారికే ఉండేదని కానీ ప్రస్తుతం తన కొడుకు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పటికీ చిరంజీవి మద్దతు తనకు లేదని,నేనైతే చిరంజీవి విషయంలో ఇలా ఎప్పటికీ చేయను…కానీ చిరంజీవి కుటుంబం మాత్రం తన కొడుకుకి కాకుండా ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నట్లు ఈ సందర్భంగా మెగా కుటుంబం పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన తన కొడుకు ఈ ఎన్నికలలో తన కొడుకు గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. విష్ణు గెలిచిన తర్వాత తన సొంత డబ్బులతోనే మా బిల్లింగ్ నిర్మిస్తానని ఈ సందర్భంగా మరోసారి మోహన్ బాబు చాలెంజ్ చేశారు. ఇకపోతే అక్టోబర్ 10వ తేదీ ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం వేగవంతంగా జరుగుతూ ఒకరి పానల్ పై మరొకరు పరస్పర మాటల దాడి చేసుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…