Featured

Mohan Babu: పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారు… డిపార్ట్మెంట్ గురించి మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!

Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు తాజాగా యంగ్ హీరో విశాల్ నటించిన లాఠీ సినిమా ప్రీరిలీజ్ వేడుకలు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సినిమా వేడుకను తిరుపతిలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ పోలీసుల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పోలీసుల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తనకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం ఉందని తెలిపారు.సమాజంలో ఏ ఒక్క సంఘటన జరిగిన అందుకు సంబంధించిన నిజా నిజాలు కేవలం పోలీసులకు మాత్రమే తెలుస్తాయని అందుకే తనకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవమని తెలిపారు. ఇలా ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రశంసల కురిపిస్తూనే పోలీసుల పట్ల ఈయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Mohan Babu: ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు…

ఇలా ప్రజలకు ఎంతో సేవ చేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నడం తనని చాలా బాధిస్తోందని ఈ సందర్భంగా పోలీసుల గురించి మోహన్ బాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

6 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

6 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

6 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

6 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

6 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

7 hours ago