Mohan Babu: మంచు ఫ్యామిలీ సోషల్ మీడియా వేదికగా లేదా ఏ ఈవెంట్లో అయినా పాల్గొని మాట్లాడారు అంటే అందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతుంటాయి. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు మంచు ఫ్యామిలీ నేటిజన్ల ట్రోలింగ్ కు గురవుతూ వచ్చింది. తాజాగా మంచు మోహన్ బాబు సైతం హీరో విశాల్ నటించిన లాఠీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.తిరుపతిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక జరగడంతో మోహన్ బాబుకు విశాల్ ఫోన్ చేసి అంకుల్ మీరు నా సినిమా ఈవెంట్ కు రావాలి అని అడగడంతో వచ్చానని తెలిపారు.తాను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇతర సినిమా ఈవెంట్లకు హాజరు కాలేదని కేవలం తన ఫ్యామిలీ సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరవుతున్నానని తెలిపారు.
ఇక విశాల్ తండ్రి గారితో నాకు ఎంతో మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఇకఈ వేడుకలో భాగంగా మోహన్ బాబు విశాల్ గురించి మాట్లాడుతూ తనకు పొగరు ఎక్కువ అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. అయితే ఏ సందర్భంలో మోహన్ బాబు విశాల్ గురించి అలా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే…
విశాల్ హీరోగా నటించిన పందెంకోడి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని మోహన్ బాబు తెలిపారు.తాను ఎంతో అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటారు. ప్రేమ చదరంగం పొగరు వంటి సినిమాలు కూడా ఇదే కోవకు చెందాయని మోహన్ బాబు తెలిపారు. వాస్తవానికి విశాల్ కి కూడా పొగరు ఉందని నాకు తెలుసు మనిషికి పొగరు ఉండాలి అయితే ఆ పొగరు ఇతరులకు హాని చేసేలా ఉండకూడదు అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు విశాల్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…