ప్రస్తుతం అటు మా ఎన్నికల వేడి ఘాటూగా సాగుతోంది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. మంచు విష్ణుకు, ప్రకాష్ రాజ్ కు మధ్య పోటీ ఎక్కువగా ఉంటుందనేది తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరో పక్క సీనియర్ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. పలు కార్యక్రమాలకు హాజరవుతూ.. ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఇటీవల ఈటీవీలో ప్రసారం అవుతున్నా ‘అలీతో సరదాగా’లో అలీతో ముచ్చటించిన మోహన్ బాబు తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. దీనికి సంబంధించి ప్రోమోను విడుదల చేశారు. అందులో జీవితం ఎలా ఉందంటూ ఆర్కే ప్రశ్నించగా దానికి మోహన్ బాబు ఇలా చెబుతాడు. ‘నిన్న జరిగింది మరచిపోను.. నేడు జరగాల్సింది వాయిదా వేయను.. రేపటి గురించి ఆలోచించను’ అంటూ డైలాగ్ చెబుతాడు.
ఇది అందరినీ ఆకట్టుకుంది. సీమ టపాకాయ్ లాగా పేలే మోహన్ బాబుకు ఇంత వేదాంతం ఎలా వచ్చింది అనగానే.. నెత్తి పగిలిపోయిందంటూ సమాధానం ఇస్తాడు మోహన్ బాబు. ఇలా ఆర్కే అడిగిన చాలా ప్రశ్నలకు మోహన్ బాబు ఆలోచించి మరీ సమాధానలు చెప్పారు.
ఇలా అడిగిన ప్రశ్నల్లో తమను టీటీడీ చైర్మన్ గా ఎందుకు నియమించలేదు అన్నదానికి ‘నాకు సీఎం జగన్ కు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారా’ అంటూ సమాధానంగా చెబుతాడు. ఇంకా చిరంజీవి ప్రస్తావన కూడా తీసుకొచ్చిన ఆర్కే ‘పెట్టడండి.. పుల్లలు పెట్టండి’ అంటూ ఆర్కేను చమత్కరిస్తాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు సంధించిన ఆర్కే మోహన్ బాబు సమాధానాలు ఎలా చెప్పాడో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…