Categories: FeaturedMovie News

Mohan Babu: ముంబై నుంచి అమ్మాయిలను తెచ్చుకుంటున్న హీరో? సూటిగా ప్రశ్నించిన మోహన్ బాబు!!

Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా విలన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. ఇప్పటికీ ఈయన ఎన్నో విభిన్న చిత్రాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక మోహన్ బాబు వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే. ఏ విషయమైనా మనసులో దాచకుండా ముక్కుసూటిగా నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిత్వం.

ఇలా మోహన్ బాబుతో మాట్లాడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు.. అయితే ఈయన ఒక స్టార్ హీరోని ముఖానే ఎందుకు ముంబై నుంచి అమ్మాయిలను తెచ్చుకుంటున్నావు అంటూ ప్రశ్నించారు. అసలు ఏ హీరోని ఈయన ప్రశ్నించారు ఏం జరిగిందనే విషయానికి వస్తే…

మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మీ ఎన్నో కార్యక్రమాలకు హోస్టుగా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో ఒకసారి నాగార్జున పాల్గొన్నారు. ఇక నాగార్జునను మంచు లక్ష్మీ ప్రశ్నిస్తూ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమని నాన్న నాకు చెప్పారనీ ఈమె నాగార్జునని ప్రశ్నించారు.

మీరు సినిమాలు చేస్తే ఎక్కువగా ముంబై హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకుంటారు అలా ఎందుకు ముంబై హీరోయిన్లను తెచ్చుకుంటారు మన తెలుగులో కూడా చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా అంటూ నాన్న ప్రశ్నించమన్నారని మంచు లక్ష్మి తెలిపారు. ఇక ఈ ప్రశ్నకు నాగార్జున ఆసక్తి కరమైన సమాధానాలు చెప్పారు.

నాకే కూతురు ఉంటే హీరోయిన్ అయ్యేది..
ముంబై హీరోయిన్లను తెచ్చుకోవడం అంటే చాలా కష్టం వారికి భాష రాదు మేనేజ్ చేయాలంటే కూడా కష్టమేనని తెలిపారు కానీ తప్పలేదు. తెలుగులో ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు కానీ నటించడానికి ఎవరు ముందుకు రావడంలేదని తెలిపారు. నాకే కనక కూతురు ఉంటే నేనే తనని హీరోయిన్ గా ప్రమోట్ చేసే వాడిని అంటూ నాగార్జున తెలిపారు. ఇక తెలుగు అమ్మాయిలు మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఇండస్ట్రీలోకి వస్తున్న తెలుగు హీరోలు కూడా నాకు నచ్చడం లేదని వారు కొత్తగా సినిమాలను ట్రై చేయడం లేదని నాగార్జున వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago