Mohan Babu: మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండవ వివాహం కావటం గమనార్హం. మనోజ్,మౌనిక రెడ్డి వివాహాన్ని లక్ష్మీ ప్రసన్న తన నివాసంలో దగ్గరుండి అన్ని తానై ఘనంగా జరిపించింది. ఇక వివాహం జరిగిన తరువాత మొదటిసారిగా మంచు మనోజ్, మౌనిక రెడ్డి కలిసి టీవి షోలో పాల్గొన్నారు.
వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షో లో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ షో లో మౌనిక రెడ్డి తన మామ మంచు మోహన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ షో లో మౌనిక రెడ్డి మాట్లాడుతూ…” మామయ్య చాలా సరదాగా ఉంటారు. మనోజ్ ని వివాహం చేసుకోక ముందు నుండి మామయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు.
పెళ్లి కాకముందు ఇంటికి వెళ్లిన సమయంలో మామయ్య నాకు అన్నం తినిపించారని మౌనిక తెలిపింది. నా కొడుకును, నన్ను మోహన్ బాబు కుటుంబ సభ్యులు సొంతవాళ్లలా దగ్గరకు తీసుకున్నారని భూమా మౌనిక ఎమోషనల్ అయ్యింది. ఇక తన అత్త గారి గురించి మాట్లాడుతూ ..’ అత్తయ్య ఫోన్ చేసి తరచూ తనతో మాట్లాడుతూ ఉంటారని, అమ్మ చనిపోయిన సమయంలో అత్తయ్య నాకు చాలా దైర్యం చెప్పారు.
ఇలాంటి కుటుంబంలోకి కోడలిగా రావడం దేవుడిచ్చిన వరం అని మౌనిక రెడ్డి తెలిపింది. అలాగే మంచు లక్ష్మితో కూడా తనకు ఒక అందమైన అనుబంధం ఉందని మంచు లక్ష్మి నన్ను చిన్నపిల్లలా చూస్తుందని ,తానే దగ్గరుండి మనోజ్ తో నా పెళ్లి జరిపించింది అంటూ అత్త ,మామ, ఆడపడచు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…