సోషల్ మీడియా ఎన్నో చిత్ర విచిత్రమైన వీడియోలు ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తుంటాయి. సోషల్ మీడియా వల్ల ఎన్నో ఫన్నీ వీడియోలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా జంతువులు చేసే చిలిపి పనులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని జంతువులు చేసే చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.
ఈ క్రమంలోనే ఓ కోతికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కోతి కూరగాయలను అమ్ముతూ దర్శనమిచ్చింది. 24 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో వ్యాపారి కూర్చోవలసిన స్థానంలో కోతి బుద్ధిగా కూర్చొని కూరగాయలు అమ్ముతున్నట్లు ఆ కోతిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
చుట్టూ కూరగాయలు, దాని పక్కన తక్కెడను చూస్తే నిజంగానే కోతి కూరగాయలు అమ్ముతుందా అనే విధంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అటుగా వెళ్తున్న పాదచారుడు తీసి సోషల్ మాధ్యమాలలో పోస్ట్ చేశారు.ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంది.అదేవిధంగా కోతికి కూరగాయలు అమ్మడం నేర్పిస్తే వ్యాపారికి కరోనా భయం ఉండదు అంటూ మరికొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు. మొత్తానికి ఈ కోతి చేసిన చిలిపి పనులు అందరికీ నవ్వును తెప్పిస్తోంది
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…