జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఇది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఎంతో కాలంగా హిట్ సినిమా లేక.. కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన బొమ్మరిల్లు భాస్కర్ కు ఇది మంచి విజయం సాధించడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
అటు అఖిల్ కూడా ఈ విజయాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. దీనిలో అతడి స్పీచ్ ఎంతగానో ఆకట్టుకుంది. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తగ్గేదేలే అంటూ స్పీచ్ స్టార్ట్ చేశాడు.
ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. రాబోయే కొన్ని తరాల వాళ్లు కూడా ఈ సినిమాను తొంగి చూసే విధంగా భాస్కర్ రూపొందించాడని.. ఎంతో అద్భుతంగా సినిమా వచ్చిందన్నారు. అన్ని తరాల వాళ్లు నచ్చేలా.. మెచ్చేలా ఈ సినిమా ఉందన్నారు. అక్కినేని ఫ్యామిలీతో తమ ఫ్యామిలీ బంధం ఈ నాటిది కాదని.. 65 ఏళ్ల బంధం అంటూ చెప్పాడు.
ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన పూజా గురించి మాట్లాడుతూ.. మా డార్లింగ్ అంటూ సంబోధిస్తూ.. ఈ సినిమాలో చించేసింది అన్నాడు. ఆమె సినీ కెరీర్ లో ఇదో పెద్ద సస్సెషనల్ హిట్ గా నిలిచిపోయిద్ది అన్నాడు. ఇంకా ఇటువంటి చిత్రాలు మరెన్నో రూపొందించాలంటూ అతడు ఆమెను ప్రశంసల వర్షంలో ముంచెత్తాడు.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…