భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. అయితే రెండు రోజుల పాటు భార్య భర్తల మధ్య ఈ విధమైనటువంటి అలకలు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటారు.కానీ కొందరు మాత్రం ఇదే విషయమే ఎన్నోసార్లు ప్రస్తావిస్తూ చిన్న సమస్యలు కూడా పెద్దదిగా చేసుకుని చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితుల వరకు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడు జిల్లా కేలమంగళంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
అంచెట్టి తాలూకా మేటుకొటాయ్ గ్రామానికి చెందిన వెంకటేశ్ కు 3 సంవత్సరాల క్రితం దీపా అనే యువతితో వివాహం జరిగింది.అయితే వీరి వివాహం జరిగినప్పటి నుంచి వీరిద్దరి మధ్య కొట్లాటలు మనస్పర్థలు చోటు చేసుకునేవి. ఇలా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడంతో ఒకసారి దీప ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. ఈ క్రమంలోని ఆ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను కాపాడారు.
ఇలా ఆత్మహత్య తర్వాత కొన్ని రోజులు పుట్టింటిలోనే ఉన్న దీపను తర్వాత తన భర్త వెంకటేష్ తిరిగి కాపురానికి తెచ్చుకున్నారు. ప్రస్తుతం వీరికి ఏడు నెలల చిన్నారి ఉంది.వీరి పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్నా వీరి మధ్య గొడవలు మాత్రం తగ్గడం లేదు.ఈ క్రమంలోనే దీప తనని తన పుట్టింటికి వదిలి రావాలని కోరింది.అయితే భర్త వెంకటేష్ తనకు కొద్దిగా పని ఉంది రెండు రోజులు ఆగిన తర్వాత పుట్టింటిలో వదిలి వస్తానని చెప్పాడు.
తను అడిగిన వెంటనే తన భర్త కాదనడంతో ఆ మాటలు విన్న దీప ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది.ఈ క్రమంలోనే తన ఏడు నెలల చిన్నారిని తీసుకొని సమీప బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పని మీద బయటకు వెళ్ళిన వెంకటేష్ రావడంతో ఇంటిలో భార్య బిడ్డ కనపడక పోవటంతో చుట్టుపక్కలా గాలించాడు. చివరికి తన భార్య బిడ్డలు ఇద్దరు బావిలో శవమై తేలడంతో ఈ విషయాన్ని పోలీసులకు అందజేశారు. అయితే దీప కుటుంబీకులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని హత్య అని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…