Categories: FeaturedMovie News

Mr. Tea Navin Reddy vaishali issue : సినిమాను తలపించిన కిడ్నాప్…తెలుగు రాష్ట్రాల్లో సంచలనం నవీన్ రెడ్డి వైశాలి లవ్ స్టోరీ… షాకిస్తున్న నవీన్ రెడ్డి బ్యాక్ రౌండ్…!

Mr Tea Navin Reddy Vaishali Issue : రంగారెడ్డి జిల్లా అధిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమంది తో వచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతీని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తోలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డి కి అంతకుముందు చాలానే జరిగిందని లేటుగా బయటికి వచ్చింది. సినిమా ను తలపిస్తున్న ఈ స్టోరీ లో నవీన్ రెడ్డి నేపధ్యం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చిన్న వయసులో వేలకోట్ల వ్యాపారం…..

నవీన్ రెడ్డి సిఏ చేసి ఆపై సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. మొదట ఒక టీ షాప్ తో మొదలయిన వ్యాపారం నేడు దేశవ్యాప్తంగా 400 ఫ్రాంచైజిలతో కోట్ల టర్న్ఓవర్ బిజినెస్ తో ఉన్నాడు ఇరవై తొమ్మిదేల్ల వయసులోనే కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ ఆది స్వశక్తి తో ఎదిగిన నవీన్ రెడ్డి లాక్ డౌన్ టైములో బెంగళూరు లో వైశాలి పరిచయమైంది. డెంటల్ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న వైశాలి బ్యాడ్ మింటన్ ట్రైనింగ్ కోసం వచ్చి అక్కడ నవీన్ రెడ్డి పరిచయం అవడం ఇద్దరు స్నేహితులవడం చక చకా జరిగిపోయింది. ఆ ఇక ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం తో వైశాలి తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ దామోదర్ రెడ్డి కూడా మొదట వీరికి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇక పెద్దలు అంగీకరించడం వల్ల వీరిద్దరు ట్రిపులకు వెళ్లడం రెగ్యులర్ గా కలవడం చేసేవారు.

అయితే కొద్దికాలానికి ఏమైందో కానీ వైశాలి పేరెంట్స్ నవీన్ తో పెళ్లి వద్దని చెప్పేసారు. వైశాలిని కూడా ఒప్పించి వేరే పెళ్ళికి సిద్ధం చేసారు. అయితే వైశాలి సడన్ టర్న్ తీసుకోవడం నవీన్ ఆమెను మళ్ళీ కన్విన్స్ చేయడానికి ఆమె ఇంటి ఎదురుగా స్థలం లీజుకి తీసుకుని అక్కడ రెస్టారెంట్ పెట్టి రోజు ఆమెను చూసుకునేవాడు. ఇక వైశాలి పేరెంట్స్ నవీన్ మీద పోలీసులకు కూతురుతో కంప్లైంట్ కూడా చేయించారు. ఇప్పుడు పెళ్లి చేయాలని నిశ్చితార్థం ఫిక్స్ చెయడంతో నవీన్ 100 మందితో వచ్చి వైశాలిని తన ఇంటినుండి ఎత్తుకెళ్లాడు. అయితే ఆమె ఏడ్చడం తో తండ్రితో ఫోన్ మాట్లాడించాడు నవీన్. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వైశాలి ని కనుగోన్నారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది .

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago