Nabanitha Das:ఈ మధ్యకాలంలో సాధారణ ప్రజలకు మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఏమాత్రం భద్రత లేకుండా పోయింది. నడిరోడ్డు పైన సెలబ్రిటీలకు కూడా వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్లిపోయారు. అయితే ఇలా ఓ సెలబ్రిటీలకు కొందరు ఆకతాయిలు వార్నింగ్ ఇస్తున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూడటం గమనార్హం.
టాలీవుడ్ కి (పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ ఇండస్ట్రీ) చెందిన నవనీత దాస్, జీతు కమల్ ఇద్దరూ భార్యాభర్తలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే తాజాగా వీరిద్దరు కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి ఒక గూడ్స్ వ్యాన్ వీళ్ళ కారును ఢీకొట్టింది. ఈ ఘటన నింత పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
ఈ విధంగా గూడ్స్ వ్యాన్ వీరి కారును ఢీ కొట్టి వెళ్ళిపోతూ ఉండగా నటి నవనీత దాస్ వ్యాన్ డ్రైవర్ ను ప్రశ్నించగా డ్రైవర్ తో పాటు అతను క్లీనర్ మరో ఇద్దరు యువకులు తనని రోడ్డుపై వేధించారని అంతేకాకుండా చంపుతామని బెదిరించారు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోని నవనీత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. తనకు జరిగిన విషయాన్ని తెలియజేస్తూ అక్కడ పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని ఏమీ అనకుండా సినిమా చూస్తున్నారని నింత పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరసురామ్ బాబు డ్యూటీ ఎలా చేస్తున్నారో చూడండి అంటూ వీడియోని షేర్ చేసారు. ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్స్ పోలీసులు వ్యవహార శైలి పై మండిపడుతున్నారు. తమ పట్ల నీచంగా ప్రవర్తించడమే కాకుండా చంపేస్తామని బెదిరించడంతో ఈ దంపతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…