Mrunal Thakur: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్లకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సినిమాలో వారి పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యత నుంచి మొదలుకొని రెమ్యూనరేషన్ల వరకు హీరోలకు అధిక ప్రాధాన్యత కల్పించగా హీరోయిన్లకు మాత్రం హీరోలతో సమానమైన ప్రాధాన్యత ఇవ్వరు.ఇలా హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ వ్యత్యాసం గురించి చర్చించారు.
ఇకపోతే తాజాగా సీతారామం సినిమా ద్వారా తెలుగులో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చాలా మంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి సంకోచిస్తారని తెలియజేశారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి ఏమాత్రం మొహమాట పడకూడదని మనకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాలని ఈమె పలువురు హీరోయిన్లకు సలహాలు ఇచ్చారు.చాలామంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి మొహమాటపడుతున్నారని అయితే ఇది సరైన పద్ధతి కాదని ఈమె తెలిపారు.
మనకు ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీ ఆధారంగా మన రెమ్యూనరేషన్ మనమే నిర్ణయించుకోవాలని ఇలా నిర్ణయించుకున్నప్పుడే మన వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నామో అర్థమవుతుందని ఈ సందర్భంగా ఈమె హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హిందీలో ఈమె పిప్పా అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె రెమ్యూనరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…