Political News

Mudragada : ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన.. నా ఆరోగ్య పరిస్థితి ఇదే అంటూ.. కుటుంబ విభేదాలపై లేఖ విడుదల!

Mudragada : మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. అందులో తన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను ఆయన పంచుకున్నారు. ఆ లేఖలో ఆయన ఏం చెప్పారంటే..

“ఈ మధ్య మా కుటుంబం మీద ఒక కుటుంబం దాడి చేస్తోంది. నిజానికి వాళ్ళతో మాకు చాలా ఏళ్ల కిందటే మనస్పర్థలు వచ్చాయి. దాదాపు ఒక సంవత్సరం నుండి వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. నేను వాళ్ళ జోలికి వెళ్లకపోయినా, వాళ్ళు మాత్రం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. “మా చిన్న కొడుకు గిరిబాబు ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు” అని అన్నారు.

“నాకు కాన్సర్ వచ్చిందని, నన్ను ఇంట్లో బంధించారని, నా కొడుకు, వాళ్ళ మామ నన్ను పట్టించుకోవడం లేదని ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు. కానీ నిజం ఏంటంటే, నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం నా చిన్న కొడుకు గిరిబాబే. అతను నాకు అన్నీ తానై చూసుకుంటున్నాడు” అని ఆయన కొడుకు మీద ప్రేమను కురిపించారు.

అంతేకాదు, వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఒక కారణం ఉందని ఆయన అన్నారు. “నా కొడుకుని నాకు దూరం చేస్తే, నేను వాళ్ళ ఇంటికి వస్తానని, వాళ్ళ చెప్పుచేతుల్లో ఉంటానని అనుకుంటున్నారేమో. కానీ అది ఈ జన్మలో కాదు, ఎన్ని జన్మలెత్తినా జరగదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు.

గతంలో తన భార్యకు ఆరోగ్యం బాగాలేనప్పుడు హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించామని, ఆ తర్వాత 15 రోజులకు డిశ్చార్జ్ అయ్యాక విశ్రాంతి కోసం వాళ్ళింటికి వెళ్తే, వాళ్ళు బయటికి గెంటేశారని ఆయన గుర్తు చేశారు. “నాకు వయసు మీద పడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప వేరే ఏమీ లేవు. నేను ప్రతిరోజు నా ఇంటికి వచ్చే అభిమానులతో సంతోషంగా గడుపుతున్నాను. నన్ను బంధించాలనో, మానసికంగా బాధించాలనో ఎవరైనా ప్రయత్నిస్తే అది వారి వల్ల కాదు” అని ఆయన తేల్చి చెప్పారు.

చివరగా ఆయన రాజకీయంగా కూడా స్పందించారు. “మీకు దమ్ముంటే కాపు రిజర్వేషన్, ఎన్నికలలో ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ స్కీమ్‌లను అమలు చేయించిన తర్వాత మీ గొప్పలు చెప్పుకోండి” అని ఆయన సవాల్ విసిరారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago