Featured

Murali Mohan : సంక్షేమ పథకాలు ఎక్కువై అభివృద్ధి తక్కువైంది.. క్యాపిటల్ లేదు.. అభివృద్ధి లేదు : మురళీ మోహన్

Murali Mohan : రాజకీయాలకు, సినిమాలకు మధ్య విడదీయ్యరాని బంధం ఉంది. రామారావుగారు రాజకీయాల్లోకి వచ్చినపుడు ముఖానికి రంగేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని విమర్శలొచ్చాయి. కానీ రామారావు గారు సొంత పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాక సినిమా వాళ్ళు చాలా మంది రాజకీయాలవైపు అడుగులేసారు. అటు తమిళ నాడు రాజకీయాల్లోను సినిమా వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇక చాలా మంది సినిమా ప్రముఖులు ఎంపీలు, ఎమ్మెల్యే లుగా రాజకీయాల్లో రాణించారు. అలాంటి వారిలో మాగంటి మురళి మోహన్ గారు ఒకరు. సినిమాల నుండి రాజకీయాలవైపు వచ్చిన ఆయన టీడీపీ పార్టీ తరుపున ఎన్నికై ఎంపీ గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం తన కుటుంబం, అలాగే ఆయన సేవలు అందిస్తున్న ట్రస్ట్ భాద్యతలను చూసుకుంటున్నారు.

అభివృద్ధి.. సంక్షేమం సమానంగా ఉండాలి…

ఇక ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉన్న మురళీ మోహన్ గారు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను మాట్లాడటానికి ఇష్టపడకపోయినా కొన్ని కామెంట్స్ మాత్రం జగన్ ప్రభుత్వం మీద చేసారు. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా జరిగినపుడే రాష్ట్రం బాగుపడుతుంది. అలా కాక సంక్షేమ పథకాలతోనే పాలన సాగిస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుబడి రాష్ట్రం ముందుకెళ్ళదు. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయాలనుకోవడం లేదు, కానీ ఎవరు అధికారం లో ఉన్నా చేయాల్సింది అదే అని మాత్రమే చెబుతున్నాను.

రాజకీయాల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇన్నేళ్లు వ్యాపారం, సినిమాలు వీటి మీదే ఉండి నా కుటుంబంతో చాలా తక్కువగా గడిపాను. అందుకే ఎప్పుడు ఏ విధమైన పనులు లేకుండా కేవలం నా ఆకుటుంబానికి సమయం కేటాయిస్తున్నాను. మరీ ముఖ్యంగా నా భార్యతో సమయం గడుపుతున్నాను. ఇక నా సేవ ట్రస్ట్ పనులను చూసుకుంటూ ఉన్నాను. ఇక సినిమాలు వ్యాపారం, రాజకీయాలను పెద్దగా పట్టించుకోవాలని అనుకోవడం లేదు అంటూ మురళీ మోహన్ చెప్పారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

2 days ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

2 days ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

2 days ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

2 days ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

4 days ago