Nikhil: టాలివుడ్ యంగ్ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ సినిమా ద్వార ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఈ సినిమా ద్వారా నిఖిల్ మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత యువత, వీడు తేడా, కార్తికేయ, స్వామి రారా వంటి సినిమాల ద్వారా హీరోగా బాగా పాపులర్ అయ్యాడు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమా 2014 లో విడుదలై మంచి హిట్ అందుకుంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా ద్వారా నిఖిల్ ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ సినిమా విడుదల చేయటం కోసం ఈ సినిమా నిర్మాతలు దర్శకుడు చాలా అవస్థలు పడవలసి వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో నిఖిల్ బుల్లితెర మీద ప్రసారమవుతున్న పలు టీవీ షోస్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ కోసం సీరియల్స్ లో కూడా సందడి చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో సినిమా విడుదల చేయడం కోసం వారు పడ్డ అవస్థలు గురించి కూడా వివరించాడు.
ఈ ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ..కార్తికేయ 2 విడుదల చేయటానికి ఎన్నో అవస్థలు పడ్డాము. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలను పట్టించుకోరు. మా సినిమా పరిస్థితి కూడా అలాగే ఉండేది. సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు 12 అని ప్రకటించే సమయంలో కూడా ఆ డేట్ వద్దని చెప్పి అక్టోబర్ , నవంబర్ కు పోస్ట్ ఫోన్ చేసుకోండి . ఇప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు. మీకు థియేటర్లు ఇవ్వము అని అన్నారు. దీంతో సినిమా ఆగిపోతుందని ఒక సమయంలో ఎడ్చేశాను అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. సినిమా విడుదల విషయంలో చాలా అవస్థలు ఎదుర్కొని ఎట్టకేలకు ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకి వస్తున్నాము అంటూ నిఖిల్ వెల్లడించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…