Featured

Music Director Koti : విడిపోవద్దని వాడి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలా…: మ్యూజిక్ డైరెక్టర్ కోటి

Music Director Koti : మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయిగా ఇండస్ట్రీలోకి మ్యూజిక్ తోనే అడుగుపెట్టిన కోటి మొదట్లో రాజ్ తో కలిసి రాజ్ కోటి గా ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఇద్దరూ విడిపోయి ఎవరికి వారు సినిమాలను చేసిన రాజ్ కోటి ధ్వయం ఆ తరువాత కూడా సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక కోటి చిరంజీవి, బాలకృష్ణ వంటి అందరు అగ్ర హీరోలకు మ్యూజిక్ చేస్తూ ఎన్నో హిట్స్ అందుకున్నారు.

రాజ్ కోటి విడిపోడానికి కారణం…

దాదాపు పదేళ్ళ పాటు రాజ్ కోటి ఇద్దరూ కలిసి సినిమాలకు సంగీతం అందించారు. అలాగే ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. అలాంటి రాజ్ కోటి ధ్వయం సడన్ గా విడిపోవడానికి గల కారణాలను మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. రాజ్ తో చాలా సమయం కలిసే ఉన్నాం. కుటుంబంతో కంటే ఎక్కువగా రాజ్ నేనే కలిసి ఉన్నాం. పని చేసుకుంటూ ఎక్కువ సమయం గడిపిన మాకు విడిపోవాలి అన్నపుడు నాకు అర్థం కాలేదు. రాజే మొదట కలిసి మ్యూజిక్ చేద్దాం అన్నాడు. తానే మొదట విడిపోదాం అన్నాడు. అందరు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుందటం, సినిమా గురించి మాట్లాడటం వల్ల రాజ్ కి నేను మ్యూజిక్ చేస్తున్నాను నాతో ఎవరూ మాట్లాడటం లేదు అనే అంశం బ్రెయిన్ లో పడింది. ఇక పక్కన ఉన్నవాళ్లు వాటికి అదనంగా జోడించడంతో విడిపోవాలి అనే ఆలోచన రాజ్ కి కలిగింది.

విడిపోదామని చెప్పినపుడు దాదాపు చాలా సినిమాలు సెట్లో ఉన్నాయి. మా ఇద్దరినీ నమ్మి పెద్ధ అర్కెస్ట్రా ఉంది, వారందరికీ అన్యాయం చేయలేము అందుకే తాను రాకపోయినా ఒక్కడినే మ్యూజిక్ రాజ్ కోటి పేరు మీదే చేశాను. మూడు నెలలు చూసినా రాజ్ విడిపోదామని అనేసరికి చివరకు కాళ్ళు పట్టుకుని బతిమిలాడాను, అయినా వినలేదు. దీంతో అధికారికంగా అందరికీ విడిపోయామని చెప్పాను. వచ్చిన సినిమా ఆఫర్స్ లో 90% నా దగ్గర చేయించుకోగా 10 % రాజ్ వద్దకు వెళ్లారు. రాజ్ మీద ఇప్పటికీ నాకు ఎలాంటి విరోధం లేదు అంటూ కోటి వివరించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago