Nani-Thaman: హీరో నానికి కౌంటర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..! కారణం ఏంటి..?

Nani-Thaman: హీరో నానికి కౌంటర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..! కారణం ఏంటో తెలుసా..?

Nani-Thaman: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు థమన్. అంతలా హిట్లు కొడుతున్నాడు థమన్. మరో వైపు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడుతున్నాడు. అలవైకుంఠపురం నుంచి థమన్ గ్రాఫ్ కంప్లీట్ గా ఛేంజ్ అయింది. మ్యూజిక్ పరంగా వరస హిట్లు ఇస్తున్నాడు. తాజాగా అఖండ బ్లాక్ బస్టర్ లో థమన్ పాత్ర కూడా కీలకమైంది. ఇదిలా ఉంటే తాజాగా థమన్ చేసిన ఓ ట్విట్ న్యాచురల్ స్టార్ నానికి కౌంటరేనని ఆడియన్స్ అనుకుంటున్నారు.

Nani-Thaman: హీరో నానికి కౌంటర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..! కారణం ఏంటి..?
Nani-Thaman: హీరో నానికి కౌంటర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..! కారణం ఏంటి..?

విషయానికి వస్తే నాని నటించిన ’టక్ జగదీష్‘ సినిమాకు ముందుగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. అయితే సాంగ్స్ అన్నింటికి మ్యూజిక్ కంపోజ్ చేసిన తర్వాత..ఏమైందో ఏమో కానీ థమన్ ను సినిమా నుంచి తప్పించారు. గోపీ సుందర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్టోర్ తో పాటు డైరెక్టర్ శివ నిర్వాణ రాసిన ఓ పాటను కూడా కంపోజ్ చేశాడు గోపీసుందర్. అయితే నాని, థమన్ కు మధ్య చెడటంతోనే థమన్ ను అర్థాంతరంగా సినిమా నుంచి తప్పించినట్టు గుసగుసలు వినిపించాయి. 

Nani-Thaman: హీరో నానికి కౌంటర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..! కారణం ఏంటి..?

ఇదిలా ఉంటే ఇటీవల శ్యాంసింగరాయ్ ప్రమోషన్ లో భాగంగా హీరో నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ’సినిమాను సాంగ్స్ ఎలివేట్ చేసేలా ఉండాలి తప్పితే డామినేట్ చేసేలా ఉండకూడదని.. పాట మాత్రమే కాదు యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇలా డామినేట్ చేసిందనుకోండి.. ఇలా ఏదో ఒకటే బయటకు కనిపిస్తే.. ఎక్కడో తేడా కొట్టిందని లెక్క. సినిమా సరిగా లేదని అర్థం. అన్ని కలిసిన సినిమానే గొప్ప సినిమా అవుతుందని..దాన్నే నేను నమ్ముతా‘ అని నాని వ్యాఖ్యానించాడు.

తాజాతా థమన్ ట్విట్ విషయానికి వస్తే…

అన్ని శాఖలు అద్భుతమైన పనితీరు కనబరిచినప్పుడే.. అది కంప్లీట్ సినిమా అని మేం అంటాం.. ఎప్పడూ ఒకరు డామినేట్ చేశారని అంటే బాగా నవ్వొస్తోంది. సినిమాను అర్థం చేసుకోవడానికి లోతైన అవగాహన అవసరమని థమన్ చెప్పుకొచ్చాడు. డైలాగుల్లో డెప్త్, స్టోరీ నెరేషన్, గ్రేట్ విజువలైజేషన్, గ్రేట్ క్యారెక్టరైజేషన్, నటీ నటుల పనితీరు ఇవన్నీ తోడు అయినప్పుడు.. సినిమా వన్ మ్యాన్ షో కాదని థమన్ అన్నారు. మేం సినిమాను ప్రేమిస్తాం. సినిమా కోసం పనిచేస్తాం అని ట్విట్ చేశాడు. అయితే ఈ ట్విట్ థమన్ , హీరో నానిని ఉద్దేశించి చేసినవే అని సగటు సిని అభిమాని, నెటిజన్ల అనుమానం.