మన రక్తం ఎర్రగా ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్ అనే విషయం అందరికీ తెలిసింది. అయితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అందుకు గల కారణం సరైన పోషకాహార లోపం అని చెప్పవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోతే ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధ పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే నీరసించిపోవడం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది. అయితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగాలంటే ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా పురుషులలో హిమోగ్లోబిన్ స్థాయి 14 నుంచి 16 వరకు, మహిళలలో 12 నుంచి 14 శాతం ఉంటే ఆరోగ్యవంతులుగా పరిగణిస్తారు. అంతకన్నా తక్కువ శాతం హిమోగ్లోబిన్ మన రక్తంలో ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రక్తహీనత సమస్య ఎక్కువగా పురుషులలో కన్నా మహిళల్లో తలెత్తుతుంది. తగినంత ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరగకపోతే వడం, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల రక్తం ఎక్కువగా పోవడం వంటి వాటి ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగాలంటే ఎక్కువ శాతం విటమిన్స్ మినరల్స్ కలిగి ఉన్న గుడ్లు మాంసం వంటి పదార్థాలను తరచూ తీసుకోవాలి. అంతేకాకుండా ఐరన్ క్యాప్సిల్స్ వేసుకోవడం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుందని చెప్పవచ్చు.
దానిమ్మ, ఆపిల్, జామ వంటి తాజా పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఐరన్ పుష్కలంగా లభించే సీఫుడ్ తరచూ తీసుకోవాలి. అదేవిధంగా చిక్కుడు కాయ గింజలు, వేరుశెనగ, సోయా బీన్స్ వంటి ఐరన్ పుష్కలంగా ఉండే కూరగాయలను తీసుకోవడం ద్వారా రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ శాంతం పెరుగుతుంది. అంతేకాకుండా వేరుశెనగ గింజలు బెల్లం పాకం ద్వారా తయారు చేసుకున్న చిక్కి తీసుకోవటం ద్వారా మన శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుందని చెప్పవచ్చు.ఈ విధమైన ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…