Featured

Muthyala Subbiah : ఆ సంవత్సరంలో నిరాశతో ఉన్న చిరంజీవి – పవన్ కళ్యాణ్ లను ముత్యాల సుబ్బయ్య.. ఇలా గట్టెక్కించారు.!!

“ఘరానా మొగుడు” లాంటి బ్లాక్ బస్టర్ తో ముందుకు సాగుతున్న చిరంజీవి సినీ ప్రయాణం… మెకానిక్ అల్లుడు, బిగ్ బాస్, రిక్షావోడు వంటి ఫ్లాపులతో మెగాస్టార్ నిరాశ చెందారు. అలా ఆయన ఒక సంవత్సరం కాలం పాటు వెండితెరకు‌దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 1997 “హిట్లర్” ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఎడిటర్ మోహన్ సమర్పించగా ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎం. వి. లక్ష్మి నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి, రంభ ప్రధాన పాత్రలు పోషించారు.నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించాడు. ఈ చిత్రం 42 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది.

1996లో మలయాళం లో ఇదే పేరుతో వచ్చిన విజయవంతమైన చిత్రం తెలుగు చిత్రానికి మూలం. మలయాళంలో మమ్ముట్టి, శోభన జంటగా నటించారు. అక్కడ పెద్ద విజయం సాధించడంతో ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టారు. హిట్లర్ సినిమా కంటే ముందు ముత్యాల సుబ్బయ్య చిన్న హీరోలతో ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన చిత్రాలను రూపొందించారు. చిరంజీవితో ఓ చిత్రాన్ని రూపొందించడం తనకు వచ్చిన ప్రమోషన్ గా దర్శకుడు ముత్యాల సుబ్బయ్య భావించారు. పరాజయాలతో ఉన్న చిరంజీవి ఒక్కసారిగా హిట్లర్ చిత్రంతో గట్టెక్కారు.

చిన్నప్పట్నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన కళ్యాణ్ బాబు తను కూడా సినిమాల్లో నటించాలని ముందుకు వచ్చారు.”అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” 1996 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, సుప్రియ నాయకా నాయికలుగా నటించారు. ఇది కథానాయకుడిగా పవన్ కల్యాణ్ మొదటి సినిమా. కథానాయిక సుప్రియకు కూడా ఇది మొదటి సినిమా. ఈమె అక్కినేని నాగేశ్వరరావుకు మనవరాలు. నటుడు సుమంత్ కు చెల్లెలు. అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులను కాస్త నిరాశ పరిచింది.

అదే 1997లో ముత్యాల సుబ్బయ్య పవన్ కళ్యాణ్ తో ఒక చిత్రాన్ని రూపొందించారు. పద్మ సాయి పిక్చర్స్, శ్రీనివాసరాజు నిర్మాణం, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీత విడుదలయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాశి హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్ర కథలోకి వెళితే..కల్యాణ్ ఒక ధనవంతుడైన ముద్దు కృష్ణయ్య కొడుకు. అతనికి చిన్నతనంలోనే తల్లి చనిపోయి ఉంటుంది. తండ్రి గారాబంతో, నిర్లక్ష్యంతో విలాసాలకు అలవాటు పడతాడు. ముఖ్యంగా అమ్మాయిలను లొంగదీసుకోవడమంటే అతనికి సరదా. అతని కంపెనీలో పనిచేసే భాస్కర్(హరీష్) శిరీష(రాశీ)అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. శిరీషకు వేరే పెళ్ళి జరగబోతుంటే భాస్కర్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు.

కల్యాణ్ అతన్ని ఆపి శిరీషను దొంగతనంగా తీసుకొచ్చేస్తాడు. తీరా శిరీషను తీసుకొచ్చేసరికి భాస్కర్ తండ్రి అందుకు ఒప్పుకోడు. పైగా శిరీష శీలాన్ని శంకిస్తాడు. దిక్కు తెలియని శిరీష ఎక్కడికి వెళ్ళాలో తెలీక బాధపడుతుండే కల్యాణ్ తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర పరాజయంతో ఉన్న పవన్ కళ్యాణ్ “గోకులంలో సీత” సినిమా సూపర్ హిట్ కావడంతో.. పవన్ కళ్యాణ్ తిరిగి అనేక చిత్రాల్లో నటించారు. అలా ఈ మెగా బ్రదర్స్ ఫ్లాప్ ల్లో ఉన్నప్పుడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య వారిద్దరికీ సూపర్ హిట్ మూవీస్ ఇచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago