RRR Movie: తెలుగు రాష్ట్రాలలో బాహుబలి 2 రికార్డులను తిరగరాసిన ఆర్ఆర్ఆర్!
RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తన ప్రతి ఒక్క సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తారు. ఈ క్రమంలోనే ఐదు సంవత్సరాల క్రితం బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు.ఇలా బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన రాజమౌళి ఇప్పటి వరకు ఆ సినిమా రికార్డులను ఏ సినిమా కూడా బీట్ చేయలేక పోయింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో బాహుబలి 2 క్లోజింగ్ కలెక్షన్లు ఏకంగా 197 కోట్లను రాబట్టాయి. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేదు. ఐదు సంవత్సరాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ కేవలం 10 రోజులలోనే బాహుబలి 2 క్లోజింగ్ కలెక్షన్లను రాబట్టింది.
త్రిబుల్ ఆర్ 10 రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇలా 10 రోజులలో 200 కోట్ల రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు. ఐదు సంవత్సరాల క్రితం బాహుబలి క్లోసింగ్ కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉండటం విశేషం అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా రెండు వందల కోట్ల రాబట్టడం విషయం ఏమి కాదు అని చెప్పాలి.
ఇక పోతే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం. ఇలా రెండు సినిమాలు రాజమౌళి సినిమాలే కనుక కంపేర్ చేయలేమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా రాజమౌళి రికార్డులను రాజమౌళి మరో సినిమా బ్రేక్ చేయడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…