Mutyala Ramesh: ప్రస్తుతం సినీ పరిశ్రమలు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్క సినిమాను కూడా వందల కోట్ల బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్నారు. ఈ విధంగా అత్యధిక భారీ బడ్జెట్ సినిమాలగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డాయి.ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం పెద్ద ఎత్తున అత్యధిక వసూళ్లను రాబట్టాయని చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్లపై ప్రముఖ చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి ముత్యాల రమేష్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నో సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ కొందరు తప్పుడు కలెక్షన్లను ప్రచారం చేస్తున్నారంటూ ఈయన వెల్లడించారు.ఒక సినిమా విడుదలైన తర్వాత థియేటర్లో వచ్చే కలెక్షన్ల కన్నా సాటిలైట్ డిజిటల్ హక్కులే అధికంగా ఉన్నాయని ఈయన తెలిపారు.
ఈ విధమైనటువంటి ఫేక్ కలెక్షన్ల కారణంగా హీరోల రెమ్యూనరేషన్ పెరగడం తప్ప ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని ఈ తప్పుడు కలెక్షన్ల కారణంగా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ముత్యాల రమేష్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఒక సినిమా ఎంత మేర కలెక్షన్లను రాబట్టిందనే విషయం గురించి వాస్తవాలు తెలియజేస్తే హీరోలు కూడా రెమ్యూనరేషన్ విషయంలో కంట్రోల్ లో ఉంటారని ఈయన పేర్కొన్నారు.
ఇలా తప్పుడు కలెక్షన్ల వల్ల ఎంతోమంది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోగా కేవలం హీరోలు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఈ తప్పుడు వార్తలు కేవలం హీరోల స్థాయినీ పెంచుతోందని ముత్యాల రమేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలా ఈయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో కొందరు ఈయన వ్యాఖ్యలపై స్పందించి ఈయన మాటలకు ఏకీభవిస్తున్నారు. ప్రస్తుతం ముత్యాల రమేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…