Movie News

నేను బయబడ్డ మా నాన్నే నాకు సపోర్ట్ ఇచ్చాడు: రష్మిక

టాలీవుడ్ కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా నిలిచింది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంది. ఇండియన్ క్రష్ గానే కాకుండా మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా కూడా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇదిలా ఉంటే నిన్న ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఓ మీడియాతో ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన.. తాను తెలుగులో సినిమాలు అవకాశాలు రావడంతో భయపడుతున్న సమయంలో తన తండ్రి మదన్ ధైర్యం చెప్పి టాలీవుడ్ కు పంపించాడట. ఈ రోజు తాను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలవడం, ఇంత అభిమానం అందుకోవడంకు కారణం తన తండ్రే అని తెలిపింది.

ఇక ఆయన వ్యాపారం విషయంలో ఎప్పుడు బిజీగా ఉండేవారట. ఇక తను కూడా చాలావరకు హాస్టల్లో ఉండి చదువుకున్నాదట. అలా తన తండ్రి తో చిన్నతనంలోని అంతగా అనుబంధం ఉండేది కాదని తెలిపింది. పైగా తన తండ్రితో ఎక్కువగా గడపలేకపోయిందట. అలా తన తండ్రి ప్రేమలో సందేహాలు ఎదురయ్యాయని తెలిపింది.

కానీ తాను పెద్దయ్యాక తన తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అర్థమైందని తెలిపింది. ఆయన పని విషయంలో ఎంత బిజీగా ఉన్నా తనకు ప్రతి విషయంలో అండగా ఉండేవారని తెలిపింది. ఇక తను కన్నడ సినిమాలో తొలిసారి అడుగు పెడుతున్న సమయంలో డైరెక్టర్ వెంకీ కుడుముల తనను ఛలో సినిమా తో టాలీవుడ్ కు పరిచయం చేయాలని అనుకున్నారట. కానీ టాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ అవడంతో సినిమాలు చేయడానికి భయపడ్డానని తెలిపింది.

అప్పుడే తన తండ్రి తెలుగు సినీ పరిశ్రమ గురించి చాలా మంచిదని, గొప్పదని చెప్పి తనతో చేయించారట. అందుకే తను టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తండ్రి అని తెలిపింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago