Movie News

కాజల్ ను అలాంటి కోరిక కోరిన నిషా అగర్వాల్?

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తన అందంతో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకొని బిజీగా ఉంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇదిలా ఉంటే కాజల్ గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా కాజల్ అసలు తగ్గట్లేదు. అంతేకాకుండా డీ గ్లామర్ పాత్రలలో కూడా నటించడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ చెల్లెలు హీరోయిన్ నిషా అగర్వాల్ పరిచయం అందరికీ తెలిసిందే. ఇక ఈ బ్యూటీ తాజాగా కాజల్ గురించి తన మనసులో మాటను బయటకు పంచుకుంది.

ఇటీవలే కాజల్ తన 36వ వయస్సులోకి అడుగుపెట్టగా.. తన చెల్లి నిషా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా బర్త్ డే విషెష్ తెలిపింది. హ్యాపీ బర్త్డే మై డార్లింగ్.. అందరి ప్రేమాభిమానాలతో, ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. అంతేకాకుండా వ్యక్తిగత స్వార్థపూరిత కారణాలవల్ల కాజల్ ను త్వరగా తల్లిగా చూడాలనుకుంటున్నట్లు తెలిపింది.

గౌతమ్ తో పెళ్లి అయినప్పటికీ ఈ విషయాన్ని తనకు చెప్తూనే ఉన్నానని తెలిపింది. ఇక కాజల్ తన చెల్లి కోరికను ఎప్పుడు తీరుస్తుందో చూడాలి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జునతో కూడా నటిస్తుంది. ఇక బాలీవుడ్ లో హే సినామిక, ఘోస్ట్ లీ, ఇండియన్ 2 వంటి వరుస సినిమాలతో బాగా బిజీ గా మారింది. ఇదిలా ఉంటే తమిళ రీమేక్ సినిమాలో కూడా నటించనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago