టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ఇక ఈయన సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండగా ఇందులో పవన్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాకుండా ఇందులో రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రానా విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమా గురించి ఏదో ఒక అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కోసం పవన్ బాగా కష్టపడుతున్నాడట. ఇక రానా పాత్ర పవన్ పాత్రతో సమానంగా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా మొత్తం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన ప్రాజెక్టు పూర్తయింది. రెండో షెడ్యూల్ ప్రారంభించడానికి ప్లాన్ చేయగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్ ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తున్నారు. జూలై మొదటి వారంలో ఈ సినిమా సెట్ లోకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ నిర్మిస్తున్నారట.
ఇందులో పవన్, రానా ఒకరినొకరు తలపడే సన్నివేశాలు ఎదురవడంతో పాటు.. ఇది సినిమాకు హైలెట్ గా మారుతుందని సమాచారం. ఇక మొత్తానికి ఈ సినిమా గురించి పవన్ అభిమానులు ఎదురు చూడగా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మొదటి రోజు నుండే సెట్ లోకి అడుగు పెట్టానున్నాడట. అంతే కాకుండా పవన్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా బిజీగా ఉన్నాడు. ఇక రానా కూడా విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…