Aamani - Roja: నీ మొగుడు నీ దగ్గర నా మొగుడు నా దగ్గర ఉన్నాడంటూ ….రోజా పై కామెంట్స్ చేసిన ఆమని.. ప్రోమో వైరల్!
Aamani – Roja: ఆమని ,రోజా 90 లలో వీరిద్దరూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు గా కొనసాగుతున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో జగపతి బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం శుభలగ్నం. ఈ సినిమాలో డబ్బు కోసం ఆమని తన భర్తను రోజాకు అమ్ముతుంది. ఈ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే తన తప్పు తెలుసుకున్న ఆమని చివరికి తన భర్త కావాలని గొడవ చేస్తుంది.
అయితే ఈ సినిమాలో మాదిరిగానే ఆమని రోజా పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వీరిద్దరిలో ఆమని పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయగా రోజా రాజకీయాల్లోనూ అలాగే జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి ఆమని వచ్చారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఆమని రోజా ఇద్దరు యాంకర్ రష్మీ తో కలిసి డాన్స్ చేస్తూ వేదిక పైకి వచ్చారు.
ఇక ఈ ప్రోమోలో భాగంగా యాంకర్ రష్మీ మాట్లాడుతూ శుభలగ్నం సినిమాలో మీ ఇద్దరికీ అస్సలు పడలేదు అదే ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తారా.. అని అడగగా ఈ ప్రశ్నకు ఆమనీ సమాధానం చెబుతూ ఇప్పుడైతే నాకు ఆ సమస్య ఏమీ లేదు… ఎందుకంటే నా మొగుడు నా దగ్గర ఉన్నాడు… తన మొగుడు తన దగ్గర ఉన్నాడు అంటూ రోజా పై కామెంట్స్ చేస్తూ పరువు మొత్తం తీశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…