Actor Harsha vardhan: నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు హర్షవర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై అమృతం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో బుల్లితెరపై వెండితెర పై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన రచయితగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన నటుడు హర్షవర్ధన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈయన ముందుగా నితిన్ నటించిన ఇష్క్ సినిమాకి డైలాగ్ రైటర్ గా చేశానని అయితే ఈ సినిమా మంచి హిట్ కావటం వల్ల గుండెజారి గల్లంతయ్యిందే సినిమా స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చిందని తెలిపారు.
ఈ విధంగా ఇష్క్ సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కె.కుమార్ అనంతరం నాగార్జునతో తీసిన మనం సినిమాకి డైలాగులు రాశానని, అలాగే నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తను ఎంతో మంచి పేరు తీసుకు వచ్చాయి అని తెలిపారు.
ఇలా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తాను రాసిన ఎన్నో స్క్రిప్టులను వేరే వాళ్లు తీసుకుని బాగా ఉపయోగించుకున్నారని అయితే ఎక్కడా కూడా తన పేరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు.ఇలా తన డైలాగులు స్క్రిప్ట్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ఎక్కడ కూడా తన పేరు ఉపయోగించకపోవడం వల్ల బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలియజేశారు. ఇక ఏదైనా తనకు ఒక డైలాగ్ నచ్చకపోతే ఆ సన్నివేశం మొత్తం మారుస్తానని అలా మార్చిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా హర్షవర్ధన్ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…