Malavika: మాళవిక ఒకప్పుడు తెలుగు తెరపై కనిపించిన హీరోయిన్. తెలుగులో కొన్ని సినిమాలు చేసినా ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే తెలుగులో కొన్ని సినిమాలు చేసినా… తమిళంలో మాత్రం ఎక్కువ సినిమాలు చేసింది. అయితే తాజాగా ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది.
తాజాగా ఆలీతో సరదాగా షోలో తన ఫిలిం జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని క్లాషెస్ వస్తుంటాయి. అయితే ఇవి చిన్నవే అయినా.. గొడవ పెద్దదిగా జరిగినట్లు మీడియాలో ప్రొజెక్ట్ అయింది.
ఇలాంటి విషయాలనే చెప్పుకొచ్చింది మాళవిక. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంతో వచ్చిన ‘చాలా బాగుంది’ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది మాళవిక. శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా వచ్చిన ఈసినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది.
దీని తర్వాత అప్పరావు డ్రైవింగ్ స్కూల్, నవ్వుతూ బతకాలిరా వంటి సినిమాలను చేసింది. తెలుగులో పెద్దగా కెరీర్ సాగలేదు. అయితే తమిళంలో మాత్రం 35 సినిమాలు చేసింది మాళవిక. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకు గెస్ట్ గా మాళవిక వచ్చింది. ఈ షోకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది. దీంతో ఆలీ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. తనకు నాగార్జున అంటే ఎంతో ఇష్టం అని.. ప్రస్తుతం విజయ్ దేవర కొండ అభిమానిని అని వెల్లడించింది. చాలా బాగుంది సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ నాకు కంఫర్ట్ గా అనిపించలేదని.. హీరో శ్రీకాంత్ కు చెబితే కోప్పడ్డారంది. చాలా బాగుంది సినిమాలో ఓ రేప్ సీన్ ఇబ్బందిగా అనిపించిందని వెల్లడించింది. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమా సమయంలో రాజేంద్ర ప్రసాద్ గొడవ గురించి అడగ్గానే నవ్వేసింది. ఆ విషయాలను చెప్పలేనంటూ దాటవేసింది. అయితే రాజేంద్రప్రసాద్ కు మాళవికకు మధ్య ఎలాంటి గొడవ జరిగింది అనేది పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయినప్పుడు తెలియనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…