Samantha: అప్పటివరకు సమంతకు ఆ విషయం తెలియదు…చాలా నెర్వస్ గా ఫీల్ అయ్యింది.. కొరియోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్!
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సమంత విడాకుల తరువాత ఐటమ్ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చాలామంది ఈమె గురించి ఎన్నో విమర్శలు చేశారు. విడాకుల తర్వాత ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి సమంత వచ్చిందని ఇకపై ఈమె కెరియర్ దెబ్బతింటుందని కామెంట్లు చేశారు.
కానీ సమంత ఈ పాట ద్వారా ఒక్కసారిగా ఎంతో పాపులర్ అయింది. ఈ పాటతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో సమంత పర్ఫామెన్స్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పాటకు కొరియోగ్రఫీ అందించిన గణేష్ ఆచార్య ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని సమంత గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తాను సమంతతో కలిసి చేసిన మొట్టమొదటి పాట పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ పాటకు మొదటిసారి కొరియోగ్రఫీ చేశానని.నేను ఇదివరకే అల్లు అర్జున్ నటించిన పలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారని ఈ సినిమా కోసం దర్శకుడు నన్ను పిలిపించారని అయితే అప్పటికి కంటికి సర్జరీ ఉండాల్సి రావడంతో చేయలేనని చెప్పినట్లు తెలిపారు.
పుష్ప ప్రొడ్యూసర్స్ సర్జరీ డేట్ విషయంలో మార్పు చేసి ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం కోసం పిలిపించారు. అయితే అప్పటి వరకు ఈ పాటకు కొరియోగ్రఫీ చేసేది నేనే అనే విషయం సమంతకు తెలియదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సాంగ్ చేసే సమయంలో సమంత చాలా నెర్వస్ గా ఉందని ఈ సందర్భంగా గణేష్ ఆచార్య చెప్పుకొచ్చారు. సమంతతో ఆటిట్యూడ్ కనిపించే విధంగా డిఫరెంట్ స్టెప్స్ తాను చేయించానని గణేష్ ఆచార్య ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…