నిర్మాత నట్టి కుమార్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వివాదాలకు కారణం అవుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్న నట్టికుమార్ గతంలో చిరంజీవి ఇంట్లో పలువురు సినిమా పెద్దలతో జరిగిన సమావేశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలోని సమస్యల గురించి సమావేశం అయితే అందరిని అడిగి అందరి సమస్యలను తెలుసుకోవాలని కానీ చిరంజీవి అలా చేయకుండా కేవలం కొందరితో మాత్రమే సమావేశమయ్యారని, అసలు అది ఏ మీటింగో ఏమో ఎవరికి తెలియదు అంటూ అప్పుడు ఈ సమావేశం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా నట్టికుమార్ థియేటర్స్ రెంట్, హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై కూడా ఇదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు ఎంత పెరిగినా థియేటర్స్ రెంట్ మాత్రం అంతే ఉంటుంది. ఒక సినిమాను తెరకెక్కిస్తే ఐదుగురిని మనం పోషిస్తున్నట్లనీ, ఈ సందర్భంగా నిర్మాత నట్టి కుమార్ తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం హీరోయిన్ల రెమ్యూనరేషన్లు గురించి కూడా ఈయన మాట్లాడారు.
ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎన్నో సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో నటించినటువంటి సౌందర్య గారికి 30 నుంచి 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారని, ఇప్పుడు నిన్నగాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ కి ఏకంగా రెండు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే పై వ్యాఖ్యానించారు నట్టి కుమార్.
రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా వారికి బాడీగార్డులు, హీరోయిన్ కి ప్రత్యేకమైన కారవాన్, వారి అసిస్టెంట్లకు ఒక కారవాన్ ఇలా కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ ఆయన ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఇదంతా ప్రజల సొమ్ము, ఈ పద్ధతిలో మార్పు రావాలని ఈ సందర్భంగా నటి నిర్మాత హీరోయిన్ల రెమ్యూనరేషన్ పై ఈ విధంగా స్పందించారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…