బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన యాంకరింగ్ మాత్రమే కాకుండా నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అనసూయ.ప్రస్తుతం ఈమె బుల్లితెరపై కంటే వెండితెరపై ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
నిత్యం సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ విధంగా అనసూయ ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఈమె ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన అనసూయను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
తాజాగా అనసూయ షేర్ చేసిన వీడియోలో లేజీ డే అంటూ బెడ్ పై పెరుగు తాగుతున్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో తన కొడుకుతో పాటు తను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన పెట్ కూడా ఉంది. అయితే ఆ పెట్ పెరుగు తాగడానికి అనసూయ దగ్గరకు వస్తుండగా అలా చేయకు అగ్రెసివ్‌గా ఉంటావు, అయినా ఇది పెరుగు అంటూ తన పెట్ కి చెబుతోంది.
ఈ క్రమంలోనే అనసూయ పక్కన ఉన్నటువంటి తన కొడుకు వెంటనే అనసూయను పెరుగు అంటే ఏంటమ్మా అని అడగగా వెంటనే అనసూయ హిందీలో దహీ అని చెబుతున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్లు తెలుగు యాంకర్ అయ్యుండి కూడా పిల్లలకు తెలుగు నేర్పించకపోవడం చాలా విడ్డూరం.. అంత పెద్ద అబ్బాయికి పెరుగు అంటే తెలియకపోవడం దారుణం అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…