పలాస ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా తెరకెక్కిన చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఈ సినిమా గత శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయటం వల్ల పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఎంత వేడుకగా నిర్వహించారు.
సాధారణంగా ఏ సినిమా అయినా విడుదల అవుతుందంటే ఆ సినిమాలోని హీరో హీరోయిన్లు సినిమా ప్రమోషన్లలో పెద్దఎత్తున పాల్గొంటారు. కానీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా హీరోయిన్ మాత్రం ఎక్కడ ప్రమోషన్లలో కనిపించకపోవడంతో శ్రీదేవి హీరోయిన్ ఎక్కడ అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించినటువంటి ఆనంది సినిమా ప్రమోషన్లలో పాల్గొనక పోవడానికి కారణం ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్ర బృందంతో ఏమాత్రం సంబంధం లేకుండా, సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన పోవడానికి గల కారణం ఏమిటంటే.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ తల్లి కాబోతోంది. అందుకే సినిమా షూటింగ్ తర్వాత ఎవరికి కనిపించలేదని, ఈ విషయం తెలిసి చిత్రబృందం కూడా సైలెంట్ అయ్యారని, అందుకే ఈమె ప్రమోషన్స్లో కనిపించలేదని తెలియజేశారు.
ఇక సినిమా విషయానికి వస్తే సూరి బాబు పాత్రలో ఒక గ్రామీణ యువకుడి గా సుధీర్ బాబు కనిపించగా, సోడాల శ్రీదేవిగా ఆనంద్ కనిపించి సందడి చేశారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను భాగం ఆకట్టుకుంటుంది.ఈ సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు సినిమాపై ప్రశంసలు కు కురిపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…