Nagababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసే అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి మనకు తెలిసిందే.ఇలా పవన్ కళ్యాణ్ గెలుపుకు అక్కడ టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ చాలా కృషి చేశారు. తనుకు టికెట్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వర్మ అనంతరం పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేశారు.
ఇక పవన్ కళ్యాణ్ గెలిచిందే ఆలస్యం పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు చేదు అనుభవం ఎదురయింది ఇప్పటికే తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకోవడమే కాకుండా వర్మ కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే.
ఇకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపొందిగా అక్కడ నాగబాబు ఇటీవల పర్యటన చేసి అధికారులతో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు మాట్లాడుతూ సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కు తీసుకెళ్లాలని సూచించారు.
నాగబాబు పెత్తనం..
ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు తెలిపారు. ఇలా నాగబాబు సమావేశంతో టిడిపి శ్రేణులలో చర్చలు మొదలయ్యాయి. ఏ హోదా ఉందని ఆయన ఇక్కడ పెత్తనం చేస్తున్నారు తన తమ్ముడు గెలిస్తే ఈయన అధికారం చెలాయించడానికి వీలులేదు ఇలాంటి వాటిని మొదట్లోనే కట్ చేయకపోతే మన పార్టీకే మనుగడ ఉండదు అంటూ అక్కడ టిడిపి కార్యకర్తలు శ్రేణులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…