Categories: FeaturedMovie News

కౌన్సిలింగ్‌ దాకా వెళ్లిన సమంత-నాగచైతన్యల విడాకుల వ్యవహారం..

ప్రేక్షకులు తమ అభిమాన హీరో హీరోయిన్ల గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని నిత్యం తహతహలాడుతూ ఉంటారు. ఎలాంటి విషయం బయటకు వచ్చినా.. అది హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. అందులోనూ సెలబ్రిటీల పర్సనల్ విషయాల మీద అత్యంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంతాల విడాకుల ప్రచారం జరుగుతోంది. 2017లో వీరి వివాహం కాగా,గత కొద్ది రోజులుగా వారి మధ్య సఖ్యత లేదని విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ వార్తలు రాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

పెళ్లి.. విడాకులు.. ఈ తంతు ఇప్పుడు కామన్‌ అయిపోయింది. ఈ కల్చర్‌ ఒకప్పుడు బాలీవుడ్లో ఎక్కువగా ఉండేది. ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకు విడాకులు తీసుకోవడం. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇలాంటి ఘటనలు చాలా తక్కువనే చెప్పాలి.

అత్యంత అన్యోన్యంగా ఉన్న సమంత, నాగ చైతన్య మధ్య ఇప్పుడు మనస్పర్థలు ఏర్పడ్డట్టు తెలుస్తోంది. ఇంత ప్రచారం జరుగుతున్నా అక్కినేని ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఈ జంట నిజంగానే విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారని… ప్రస్తుతం అది ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ స్టేజ్ లో ఉందని సమాచారం. అందుకు కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. కానీ, సమంత విషయంలో చైతు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ఫ్యామిలీ కంటే సినిమాలు, ఇతర అంశాలకే ప్రాధాన్యత ఇస్తోందని వార్తలొస్తున్నాయి.

సమంత ఫ్యామిలీ లైఫ్ కి పరిమితం కావాలని…కానీ అందుకు సమంత అంగీకరించడం లేదని..అందుకే విభేదాలు మొదలైనట్లు ప్రచారం. మూడేళ్లపాటు ఈ జంట అన్యోన్యంగా ఉన్న వీరు.. సడన్‌గా ఇలా విభేదాలు తలెత్తడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

38 minutes ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

47 minutes ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

1 hour ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

1 hour ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

1 hour ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

2 hours ago