Naga Chaitanya: ఆ హీరోయిన్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య.. ఈ వార్తలలో నిజమెంత?
Naga Chaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని దశాబ్దాల నుంచి అక్కినేని కుటుంబం ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి నాగచైతన్య అఖిల్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వారి కెరీర్ పై ఎంతో దృష్టి సారిస్తూ బిజీగా ఉన్నారు.
ఇకపోతే నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య గత ఏడాది హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ప్రేమించి రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
ఈ విధంగా నాగచైతన్య సమంత విడిపోవడంతో నాగచైతన్య ప్రస్తుతం తన సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నాగార్జున తన రెండవ కొడుకు అఖిల్ కి పెళ్లి చేయాలనే ఆలోచన చేస్తూ అఖిల్ కోసం అమ్మాయిని వెతికే పనిలో పడ్డారనీ టాలీవుడ్ సమాచారం. పనిలో పనిగా నాగచైతన్యకు కూడా ఒక మంచి అమ్మాయిని వెతికి ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు టాలీవుడ్ కోడై కూస్తుంది.
ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య ఇండస్ట్రీకి చెందిన మరొక హీరోయిన్ ను ప్రేమిస్తున్నారనే వార్త నాగార్జున చెవిన పడటంతో నాగార్జున వీరి పెళ్లి చేయడానికి సమ్మతంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈ రెండో పెళ్లి విషయంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియక అభిమానులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని సన్నిహితులు ఈ విషయంపై స్పందిస్తూ నాగచైతన్య రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అవి కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం అఖిల్ చైతన్య ఇద్దరు కూడా వారి కెరియర్ పై ఫోకస్ పెట్టారని అక్కినేని సన్నిహితవర్గాలు క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…