Naga Sourya : మేము బలి పశువులు అయ్యాం… ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోవాలి అనిపించింది : ఉషా ముల్పూరి

Naga Sourya : నాగ శౌర్య ‘చందమామ కథలు’ సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టినప్పటికీ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో మొదటి సారి హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకున్నారు. ‘ఛలో’ సినిమాతో తన కెరీర్ లో కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నారు. తరువాత ‘లక్ష్య’ వంటి సినిమాలు ఆశించిన విజయాలను అందించలేదు. పక్కింటి కుర్రాడిలా ఉండే నటనతో అందరినీ ఆకట్టుకున్న నాగశౌర్య ఇపుడు మరి రూటు మార్చి లవ్ స్టోరీ లకి మారిపోయాడు.

మీ మీద చాలా కుటుంబాలు అదారపడి వున్నాయి అని ధైర్యం చెప్పారు…

ప్రస్తుతం నాగ శౌర్య నుండి వస్తున్న సినిమా  ‘కృష్ణ వ్రిందా విహారి’. ఈ సినిమాని తమ సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పై నాగ శౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 23 న సినిమా విడుదల ఉండటంతో ఈమె మీడియాతో మాట్లాడుతూ… ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదట ఈ సినిమా కథని నాగ శౌర్య విన్నాడు, నచ్చడంతో వెంటనే మొదలు పెట్టాము. ఇందులో హీరో హీరోయిన్ల పేర్ల మీదనే సినిమా టైటిల్ పెట్టడం జరిగింది అని చెప్పారు. ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని, హీరోయిన్ చాలా చక్కగా నటించింది అని చెప్పుకొచ్చారు.

షూటింగ్ సమయం చాలా కష్టాలు పడ్డామని బావోద్వేగానికి లోనయ్యారు. షూటింగ్ విషయంలో, రిలీజ్ విషయంలో చాలా కష్టాలు పడ్డాము, కొన్ని విషయాలలో మేము బలిపశువులం అయ్యాము. అయితే అన్నీ విశయాల గురించి బయట చెప్పుకోలేము కదా అంటూ… ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోవాలి అని కూడా అనుకున్నాము. మీ మీద చాలా కుటుంబాలు ఆధారపడివుంటాయి అని కొంత మంది ధైర్యం చెప్పడంతో ఆగిపోయాము అని నిర్మాత ఉషా మూల్పూరి చెప్పుకొచ్చారు.