Featured

మరో కామెడీ షోకి జడ్జిగా నాగబాబు ఎంట్రీ.. శ్రీముఖి డైలాగ్ తో ఇలా..!

‘జబర్దస్త్‌’ అంటే కొన్ని రోజుల క్రితం టక్కున గుర్తుకు వచ్చే పేర్లలో ముఖ్యంగా నాగబాబు ఒకరు. ఈ షోకు ఆయనే పెద్ద ప్లస్. అతడి నవ్వే అద్దరినీ కట్టి పడేస్తుంది. జబర్దస్త్ లో చేసే టీం మెంబర్లకు కూడా.. తప్పొప్పులు చెబుతూ.. దగ్గరుండి ముందుకు నడిపించాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయి.. జీ లో కొత్త కామెడీ షోకి శ్రీకారం చుట్టాడు.

అందులో జడ్జిగా వ్యవహరించాడు. ‘అదిరింది’ అనే కామెడీ షోని జీలో ప్రసారం చేశారు. అందులో కూడా సీనియర్ టీం లీడర్లు అయిన చమక్ చంద్ర, వేణు, ధన్ రాజ్ లాంటి వాళ్లు చేశారు. మళ్లీ ఆ షో కూడా కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ సీజన్ వరకు ఇంతే.. మళ్లీ మరో సీజన్ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు.

ఏదేమైనా కొన్నాళ్ల వరకు బాగానే రన్ అయిన ‘అదిరింది’ షో నిలిపివేశారు. ఇక తర్వాత చాలా రోజుల వరకు గ్యాప్‌ తీసుకొని.. ఇప్పటికే మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్‌ షోలో ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఈ షోకి జడ్జిగా వచ్చారు. కొన్ని రోజుల క్రితం వరకు షోకి శేఖర్‌ మాస్టర్‌ జడ్జిగా ఉండేవారు. తర్వాత ఏమైందో ఏమో గానీ.. గత రెండు, మూడు ఎపిసోడ్ల నుండి ఆయన రావడం లేదు.

శేఖర్ మాస్టార్ బహుషా కొరియోగ్రఫీలో బిజీ అయిపోయరేమో. అయితే ఆయన స్థానంలో అలీ వచ్చారు. ఇప్పుడు నాగబాబు ఫుల్‌ టైమ్‌ జడ్జిగా వచ్చారట. ఆయన ఎంట్రీలో శ్రీముఖి డైలాగ్‌తో ఈ విషయం తేలిపోయింది. అయితే ఎందుకు లేటు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇప్పుడు నాగబాబు రాకతో ఈ షో ఎంత వరకు ఆకట్టుకుంటుదో చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలలో కొత్త అనుభవం.. భక్తులకు వీఆర్ ద్వారా శ్రీవారి దర్శనం!

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో, క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండే సమయం కూడా ఎక్కువవుతోంది.…

2 minutes ago

“ఆర్టిస్టులు నేరస్తులా?”.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఫైర్

సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర…

5 minutes ago

ఆలయ దర్శనంతో సందడి చేసిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో భక్తి వాతావరణం నెలకొంది. గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో తాజాగా నిర్మించిన కాశి విశ్వేశ్వరాలయం…

15 minutes ago

పెరుగు మంచిదా? మజ్జిగ మంచిదా? నిపుణుల క్లారిటీ

వేసవి కాలం మొదలైతే మన శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలపై అందరి దృష్టి పడుతుంది. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ అనే…

36 minutes ago

“మా రాజధాని అమరావతి”.. గర్వంగా చెప్పే రోజు వచ్చిందన్న బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కీలక పరిణామాల మధ్య నటుడు, ప్రజాప్రతినిధి నందమూరి బాలకృష్ణ భావోద్వేగ స్పందన వ్యక్తం చేశారు. అమరావతికి…

1 hour ago

పేలుడుతో చిద్రమైన ఇల్లు.. ఇద్దరు పిల్లలు బలి

మణిపూర్ రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక నివాస గృహంపైకి అనుమానాస్పదంగా రాకెట్ దూసుకువచ్చి పేలడంతో…

1 hour ago