Nagababu:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకోబోతున్నారంట గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా జూన్ 9వ తేదీ ఇద్దరు ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారని వార్త వైరల్ గా మారింది. దీంతో వరుణ్ తేజ్ లావణ్య విషయం ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగబాబుకి వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది.త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగడంతో నాగబాబు ఈ విషయం గురించి సమాధానం చెబుతూ..
వరుణ్ తేజ్ పెళ్లి అయితే త్వరలోనే జరుగుతుంది కానీ తను చేసుకోబోయే అమ్మాయి గురించి నాకు ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు.తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తానే అన్ని విషయాలు చెబుతాడు అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే వరుణ్ లావణ్య గురించి ప్రస్తావించినప్పటికీ ఈ వార్తలను ఖండించకుండా వరుణ్ చెబుతాడని దాట వేశారు.
నాగబాబు ఇలా వరుణ్ పెళ్లి గురించి స్పందించడంతో వరుణ్ తేజ్ లావణ్య గురించి వచ్చే వార్తలలో నిజం ఉందని అందుకే నాగబాబు ఈ వార్తలను ఖండించలేదంటూ పలువురు ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థపు ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…