Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. ఈయన నటి లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తున్నారనీ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా వీరిద్దరి పెళ్ళికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ జూన్ 9వ తేదీ నిశ్చితార్థం జరుపుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం గురించి ఎక్కడ ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేకపోయినా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలందరూ కూడా వారి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోలలో ఈయన ఒకేసారి చెఫ్ గా మారిపోయారు. తనకు ఎంతో ఇష్టమైన పిజ్జాతో పాటు గవ్వలను కూడా చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వంట చేస్తున్నటువంటి ఫోటోలను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలపై నేటిజన్స్ చాలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నేటిజన్స్ వరుణ్ తేజ్ షేర్ చేసిన ఫోటోలు పై స్పందిస్తూ అన్న ఏంటి పెళ్లికి ముందే ఇలా వంట గదిలోకి వెళ్లి వంటలు చేస్తున్నావు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ముందుగానే ప్రిపేర్ అవుతున్నావా అన్న అంటూ కామెంట్లు చేయగా.. ఏంటన్న వదినకు వంటలు రావా నువ్వే చేస్తున్నావ్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇక పలువురు అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కూడా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…