Nagababu: నాగబాబు పరిచయం అవసరం లేని పేరు. మెగా బ్రదర్ గా మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా కూడా కొనసాగిన ఈయన ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించిన నాగబాబు కూటమి గెలుపు కోసం పోటీ నుంచి తప్పుకొని కూటమి విజయం కోసం కష్టపడ్డారు.
ఇక నిత్యం పార్టీలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నాగబాబు తన అన్నయ్య చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాను నిర్మాతగా ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు నష్టపోయినప్పుడు నా పక్కన నిలిచింది నా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలిపారు. ఈ జీవితం వాళ్ళ ఆశయాల కోసమే. వాళ్ళ కోసం నిలబడి నాకు చేతనైనంత వరకు సేవ చేస్తాను. రాజకీయాల్లో నాకంటూ ఎలాంటి ఆశలు లేవు అలాగే పదవి కాంక్ష కూడా లేదు.
కూటమి రావటం మన అదృష్టం..
నా ఒంట్లో శక్తి, ఓపిక ఉన్నంతవరకు తమ్ముడు పవన్ కళ్యాణ్ కలల కోసం పనిచేస్తాను.మనం గొప్పవాళ్ళం కాకపోయినా గొప్పవాళ్లకు అండగా నిలబడాలి. నేను అది చేయగలిగాను. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం మన అదృష్టం ఏపీలో కూటమి అధికారంలోకి రావడం శుభ పరిణామం అంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…