Nagababu: మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా గుర్తింపు పొందిన నాగబాబు కొంతకాలం జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు లేకపోవడంతో అడపాదడపా సినిమాలలో నటిస్తూ రాజకీయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తూ ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇక ఎలక్షన్ల సమయం సమీపించటంతో పార్టీని బలోపేతం చేయడానికి సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టి దగ్గరుండి తానే అన్ని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నాగబాబు షేర్ చేసిన ఒక పోస్ట్ వివాదాలకు దారితీస్తోంది. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న నాగబాబు మరొసారి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.
ఇక తాజాగా వేట కొడవలి చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోని నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” మంచి అనేది విఫలం చెందినప్పుడు న్యాయం, శాంతి సాధించడానికి హింసే మార్గం” అంటూ రెచ్చగొట్టేలా పోస్ట్ షేర్ చేశాడు. అయితే నాగబాబు ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పోస్టర్ షేర్ చేశాడా? లేక కావాలనే వైసిపి పార్టీ నాయకులను రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అన్నది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా నాగబాబు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన జనసైనికులు కూడా మీ వెనక మేమున్నాం అంటూ తెగ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు నాగబాబు చేసిన పోస్ట్ రెచ్చగొట్టేలా ఉంటాయి. అయితే ఇలా పబ్లిక్ లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటంతో కొందరు నాగబాబు పట్ల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఒక కీలకమైన పదవిలో అంటూ ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడం సరైన పద్దతి కాదు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నాగబాబు షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…