Nagachaitanya:ఈ మధ్యకాలంలో సినిమా వేడుకలు కనుక జరిగితే రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పలు సినిమా వేడుకలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈయన నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు.
నాగచైతన్య కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన చిత్రం కస్టడీ ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమవుతుంది ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ వేదికగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నటువంటి మల్లారెడ్డి నాగచైతన్య గురించి పలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ తాత అక్కినేని నాగేశ్వరరావు గారు నా ఫేవరెట్ హీరో ఆయనలా నువ్వు కూడా ఒక గొప్ప స్టార్ అవుతావు అంటూ కామెంట్ చేశారు.ఇక నాగచైతన్యను ఉద్దేశిస్తూ తన చేయి చూపిస్తూ ఇది నా చెయ్యి నా చేతిలో నీ చెయ్యి వెయ్యి ఇక నీ సమస్యలన్నీ పోయి నువ్వు సక్సెస్ అవుతావు అంటూ కామెంట్లు చేశారు.
సీఎంఆర్ వేదికగా నీ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టావు.. ఇక ఈ సినిమా సక్సెస్ అయినట్లే అంటూ ఈయన అక్కడ ఉన్నటువంటి వారిలో ఉత్సాహం నింపుతూ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. థాంక్యూ, లాల్ సింగ్ చద్దావంటి సినిమాలతో డిజాస్టర్లు ఎదుర్కొన్నటువంటి నాగచైతన్యకు కస్టడీ సినిమా ఎలా కలిసి వస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…