Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందిన అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జోష్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన నాగచైతన్య ఆ తర్వాత ఏ మాయ చేసావే చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత నాగచైతన్య నటించిన సినిమాలు అన్నీ కూడా ఒక మోస్తారుగా హిట్ అందుకున్నాయి.
ఇక ఇటీవల విడుదలైన థాంక్యూ సినిమా డిజాస్టర్ గా మిగిలి నాగచైతన్యని నిరాశ పరిచింది. ఇక ప్రస్తుతం కస్టడీ సినిమా ద్వారా నాగచైతన్య ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమా విడుదల తేదీ సమీపించడంతో ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో నాగచైతన్య కూడా సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నాగచైతన్య చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ ఇంటర్వ్యూలో ట్రూత్ అండ్ డేర్ సెగ్మెంట్లో భాగంగా ” ఇప్పటివరకు మీరు ఎంతమందిని ముద్దు పెట్టుకున్నారు అని నాగచైతన్య ని యాంకర్ ప్రశ్నించాడు. దీంతో నాగచైతన్య స్పందిస్తూ… ఏమో నాకు తెలియదు.. ఆ లెక్క మర్చిపోయాను. సినిమాల్లోనే ఎక్కువ అటువంటి సన్నివేశాలలో ముద్దు పెట్టాను.అందువల్ల ఆ సినిమాలన్ని గుర్తు పెట్టుకోలేము కదా. అయినా ఇది అందరికీ తెలిసిన విషయమే అంటూ కొంచం సిగ్గు పడుతూనే సమాధానం ఇచ్చాడు. దీంతో నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…