Movie News

Nagachaitanya: సరైన నిర్ణయం తీసుకోలేకపోయా.. నా జీవితంలో ఉన్న బాధ అదే.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్!

Nagachaitanya: అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం ‘ కస్టడీ ‘ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది . ఈ సినిమాలో నాగచైతన్యకి జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ జంటగా నటించిన బంగార్రాజు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఇక మరొకసారి వీరిద్దరూ కస్టడీ సినిమాలో జంట కట్టారు. ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు ప్రారంభం అయ్యాయి.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా తన జీవితంలో బాధపడిన సందర్భాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. ” ఇప్పటివరకు నా జీవితంలో ఎటువంటి బాధాకరమైన సంఘటనలు జరగలేదు.

జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన ఒక పాఠం నేర్పింది. కానీ కొన్ని సందర్భాలలో సినిమాల విషయంలో బాధపడ్డాను. ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఆ మూడు సినిమాల విషయంలో ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను ” అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు.అయితే నాగచైతన్య కెరీర్ లో సరైన నిర్ణయం తీసుకోలేకపోయిన ఆ మూడు సినిమాలు ఏమిటా? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.

Nagachaitanya: కస్టడీ హిట్ కొట్టెనా…


ఇదిలా ఉండగా సమంతకి దూరమైన తర్వాత నాగచైతన్య వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల థాంక్యూ సినిమా ద్వారా పరాజయం అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాపై నాగచైతన్య చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago