Dhee show Bobby Master : ఢీ డాన్స్ షో ద్వారా అందరికీ సుపరిచితుడైన చైతన్య మాస్టర్ శనివారం నాడు నెల్లూరు లోని క్లబ్ హోటల్ లో ఆత్మహత్య చేసుకుని మరణించడంతో టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఎపుడూ అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండే చైతన్య మాస్టర్ ఒక్కసారిగా దూరం అవ్వడం ఢీ లో పనిచేస్తున్న డాన్స్ మాస్టర్లు అలాగే బాయ్స్ ఎవరూ తట్టుకోలేక పోతున్నారు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో ఇంట్లో వాళ్లకు స్నేహితులకు ఢీ మిత్రులకందరికీ సారీ చెప్పి ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్లు చెప్పి ఉరి వేసుకున్న చైతన్య మాస్టర్ గురించి ఆయనతో కలిసి పనిచేస్తున్న బాబీ మాస్టర్, చిట్టీ మాస్టర్ వంటి వారు ఎమోషనల్ అయ్యారు. ఒక్కసారి కూడా తమతో తనకున్న బాధ చెప్పలేదని మా టెడ్డి దూరమయ్యాడంటూ ఏడ్చారు.
చనిపోయే ముందు అందరికీ కాల్ చేసి మాట్లాడాడు…
బాబీ మాస్టర్ మాట్లాడుతూ చైతన్య మాస్టర్ తో తనకున్న అనుబంధాన్ని చెప్పాడు. అందరితో ఎపుడు సరదాగా నవ్వుతూ ఉంటాడని, లైఫ్ గురించి అందరికీ ధైర్యం చెప్పే తాను ఇలా చేస్తాడని ఊహించలేదని చెప్పారు. బాధ ఎపుడు పైకి చూపించలేదని మాలో ఎవరికైనా తన బాధ షేర్ చేసుకుని ఉన్నా ఈరోజు ఈ దారుణం జరిగేది కాదని తెలిపారు. ఒక టెడ్డి తో ఆడుకున్నట్లు తనతో అందరూ ఆడుకునేవాళ్ళమని తాను డాన్స్ చేస్తే లైట్ బాయ్స్ తో మొదలుకొని డాన్స్ మాస్టర్స్ వరకు అందరు చూసేవాళ్ళు అంటూ చెప్పారు.
తాను అందరితో సరదాగా ఉంటూ తన వద్ద ఉండే బాయ్స్ ని కూడా చాలా బాగా చూసుకునేవాడు, ఆర్థిక ఇబ్బందులే కారణం అని అనిపించడం లేదు అంటూ తెలిపారు బాబీ మాస్టర్. ఇక చిట్టీ మాస్టర్ కూడా తాను నాకు పదేళ్ళు పైగానే పరిచయం అని, నాతో రూంమేట్ గా ఉండేవాడని, ఏనాడూ ఒత్తిడికి గురైంది చూడలేదని అందరికీ చనిపోయే ముందు ఫోన్ చేసి మాట్లాడాడు అంటూ బాధపడ్డారు. అప్పుడు కూడా సరదాగా మాట్లాడి పెట్టేసాడు ఏమాత్రం తెలియనివ్వలేదు అంటూ చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…