Nagarjuna -Balakrishna: సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు కొన్ని పండుగ సందర్భాలలో ఒకేసారి విడుదలకు సిద్ధమవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఉంటాయి. ఇలా ఈ పోటీలలో ఒకరు విజయం సాధించి మరొకరు అపజయం పాలు కావచ్చు. అయితే 2012వ సంవత్సరంలో నాగార్జున బాలకృష్ణ మధ్య కూడా ఇలాంటి పోటీనే ఏర్పడింది. ఈ ఏడాదిలో బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ, నాగార్జున నటించిన షిరిడి సాయి సినిమాలు వారం వ్యవధిలో విడుదలకు సిద్ధమయ్యాయి.
ముందుగా బాలకృష్ణ శ్రీమన్నారాయణ సినిమా విడుదలైంది. అయితే బాలకృష్ణ తన సినిమాలను కొన్ని థియేటర్లలో సెంటిమెంట్ గా భావిస్తారు. కూకట్ పల్లిలోని ఫేమస్ థియేటర్లో శ్రీమన్నారాయణ సినిమా ప్రసారమవుతుంది.అయితే ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతున్న నేపథ్యంలో ఇదే థియేటర్లో నాగార్జున నటించిన షిరిడి సాయి సినిమాని విడుదల చేశారు.
ఇలా మంచి కలెక్షన్లు రాబడుతున్న శ్రీమన్నారాయణ సినిమాను తీసేసి శిరిడి సాయి సినిమా వేయడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఇక్కడి నుంచి మొదలయ్యాయని తెలుస్తోంది.షిరిడి సాయి సినిమా వేయకుండా ఉండడం కోసం బాలయ్య పలు ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలితం లేకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని సమాచారం.
ఇక ఈ సినిమా సమయం నుంచి బాలకృష్ణ పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీ గురించి కామెంట్లు చేయడం గమనార్హం. అయితే ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు కల్పించుకోవడానికి కూడా ఆసక్తికనభరచడం లేదు. ఇద్దరు అగ్ర హీరోలే ఒకరికి అనుకూలంగా మాట్లాడితే మరొకరి నుంచి వ్యతిరేకత వస్తుందన్న నేపథ్యంలో సినీ పెద్దలు కూడా ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…