Nagarjuna: ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిత్రం ది ఘోస్ట్ ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించారు. ఈ సినిమా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రిపోర్టర్లు నాగార్జునను ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు.అయితే ఒక రిపోర్టర్ వింత ప్రశ్న అడగడంతో నాగార్జున సైతం తనదైన శైలిలో సమాధానం చెప్పారు. సినిమాలలో మీకుగర్ల్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ చేయడం ఇష్టమా లేక గన్నులతో ఫైరింగ్ చేయడం ఇష్టమా అంటూ ప్రశ్నించారు.
ఈ విధంగా రిపోర్టర్ వింత ప్రశ్న అడగడంతో నాగార్జున సైతం అదే స్థాయిలో సమాధానం చెప్పారు.నాకు ఒక వైపు గర్ల్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ చేయడం ఇష్టం మరోవైపు గన్నుతో ఫైరింగ్ చేయడం ఇష్టం అంటూ నాగార్జున సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఫన్నీ వాతావరణం నెలకొంది. మొత్తానికి నాగార్జున చెప్పిన ఈ సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. అలాగే డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ మాట్లాడుతూ ఈ సినిమాలో నాగార్జున యాక్షన్ విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది.ఈ సినిమా చూసినప్పుడు మేము ఎలా ఎక్సైట్ ఫీలయ్యామో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అలాంటి ఫీలింగ్ వస్తుందని ఈ సందర్భంగా ప్రవీణ్ సత్తారు సినిమా గురించి తెలియజేశారు.అక్టోబర్ 5వ తేదీ రాబోతున్న ఈ సినిమా నాగార్జునకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…