Political News

Akkineni Nagarjuna : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన నాగ్.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!

Akkineni Nagarjuna : అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది! మన ఏఎన్నార్ మనవడు, కింగ్ నాగార్జున గారి చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాగార్జున గారు స్వయంగా రాజకీయ, సినీ ప్రముఖులను కలిసి పెళ్లి కార్డులు అందజేస్తున్నారు.

రీసెంట్‌గా నాగార్జున గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు గారిని కలిసి, తన చిన్న కుమారుడు అఖిల్ పెళ్లికి తప్పకుండా రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు గారికి పెళ్లి పత్రికను అందజేశారు. ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు.

అంతకుముందు నాగార్జున, అమల దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి అఖిల్ పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లికి తప్పకుండా రావాలని కోరారు.

అఖిల్, జైనాబ్ ల వివాహం ఈ నెల 6న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరవుతారు. జైనాబ్ ప్రముఖ వ్యాపారవేత్త జూల్ఫీ రావ్‌జీ గారి కుమార్తె. వీరి నిశ్చితార్థం గత ఏడాది నవంబర్‌లో జరిగింది.

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఎంగేజ్‌మెంట్ తర్వాత అఖిల్ తన కాబోయే భార్యతో చాలాసార్లు కనిపించారు. పెళ్లి తర్వాత రాజస్థాన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. పెళ్లికి కొద్దిమంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించి, రిసెప్షన్‌కు అందరినీ ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago