Akkineni Nagarjuna : అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది! మన ఏఎన్నార్ మనవడు, కింగ్ నాగార్జున గారి చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాగార్జున గారు స్వయంగా రాజకీయ, సినీ ప్రముఖులను కలిసి పెళ్లి కార్డులు అందజేస్తున్నారు.

రీసెంట్‌గా నాగార్జున గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు గారిని కలిసి, తన చిన్న కుమారుడు అఖిల్ పెళ్లికి తప్పకుండా రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు గారికి పెళ్లి పత్రికను అందజేశారు. ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు.
అంతకుముందు నాగార్జున, అమల దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి అఖిల్ పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లికి తప్పకుండా రావాలని కోరారు.
అఖిల్, జైనాబ్ ల వివాహం ఈ నెల 6న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరవుతారు. జైనాబ్ ప్రముఖ వ్యాపారవేత్త జూల్ఫీ రావ్‌జీ గారి కుమార్తె. వీరి నిశ్చితార్థం గత ఏడాది నవంబర్‌లో జరిగింది.
కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఎంగేజ్‌మెంట్ తర్వాత అఖిల్ తన కాబోయే భార్యతో చాలాసార్లు కనిపించారు. పెళ్లి తర్వాత రాజస్థాన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. పెళ్లికి కొద్దిమంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించి, రిసెప్షన్‌కు అందరినీ ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.































